MTB Himachal Janjehli 2022 1st Edition: ముగిసిన ఫైనల్ స్టేజ్.. 3.5 కి.మీలను కవర్ చేసిన 43 మంది రైడర్లు..

First Published Jun 27, 2022, 4:00 PM IST

ఎంటీబీ హిమాచల్ జంజెహ్లీ 2022 మొదటి ఎడిషన్ మౌంటెన్ బైకింగ్ రేస్ చివరి దశలో పలు ప్రాంతాలకు చెందిన 43 మంది రైడర్లు పోటీపడ్డారు. 3.5 కిలోమీటర్ల మేర ఈ పోటీ జరిగింది. 

ఎంటీబీ హిమాచల్ జంజెహ్లీ 2022 మొదటి ఎడిషన్ మౌంటెన్ బైకింగ్ రేస్ చివరి దశలో పలు ప్రాంతాలకు చెందిన 43 మంది రైడర్లు పోటీపడ్డారు. 3.5 కిలోమీటర్ల మేర ఈ పోటీ జరిగింది. ఇందు కోసం ఇరుకైన రోడ్లను కలిగి ఉన్న సంగ్లార్వాలా గ్రామం మధ్య మార్గం చార్ట్ చేయబడింది. అయితే ఈ ప్రాంతం మొత్తం ఆపిల్ తోటలు కలిగి అందమైన దృశ్యాలతో కనువిందు చేస్తుంటుంది.

హిమాచల్ ప్రదేశ్‌లో సైక్లింగ్ టూరిజం, రాష్ట్రం అందించే అందమైన ట్రాక్‌లు, ట్రయల్స్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ రైడర్‌లకు శక్తివంతమైన హిమాలయ అధిరోహణను సవాలు చేసే అవకాశాన్ని కూడా అందించింది.

ఈ పోటీల 3వ దశ వివిధ విభాగాల నుంచి రైడర్‌లను కలిగి ఉంది. అండర్ 16 కేటగిరీ మొత్తం దూరాన్ని నాలుగు రౌండ్లు కవర్ చేయాల్సి ఉండగా.. మిగిలిన కేటగిరీలు మొత్తం దూరాన్ని ఆరు రౌండ్లు కవర్ చేయాలి.
ఫైనల్ రైడ్ ఆధారంగా ఫలితాలు ఇలా ఉన్నాయి.. 
అండర్ - 16 కేటగిరీ
1. యుగల్ ఠాకూర్
2. వంశ్ కలియా
3. అధిరత్ సింగ్

U-19 కేటగిరీ (బాలురు)
1. అర్పిత్ శర్మ
2. విశాల్ ఆర్య
3. కునాల్ బన్సాల్

U-19 కేటగిరీ (బాలికలు)
1. దివిజా సూద్
2. కైనా సూద్
3. శాంభవి సింగ్

Also Read: MTB Himachal Janjehli 2022 1st Edition : ముగిసిన స్టేజ్-2 రేస్.. 48మంది రైడర్లు, 37 కి.మీల మేర సాగిన పోటీ

A-19 కేటగిరీ
1. సునీతా శ్రేష్ట
2. అస్తా దోభాల్

U-23 కేటగిరీ(బాలురు)
1. పృథ్వీ సింగ్ రాథోడ్
2. అమన్‌దీప్ సింగ్ దయాల్
3. అనీష్ దూబే

U-35 కేటగిరీ(పురుషులు)
1. రాకేష్ రాణా
2. క్రాంశ్వేంద్ర సింగ్ యాదవ్
3. రామకృష్ణ పటేల్


U-50 కేటగిరీ (పురుషులు)
1. సునీల్ బరోంగ్పా
2. అమిత్ బల్యాన్
3. జస్ప్రీత్ పాల్

A-50 కేటగిరీ
1. భారత్ సా

ఇక, జూన్ 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో MTB హిమాచల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాని మోదీ ఒక విశిష్ట కార్య‌క్ర‌మంగా అభివర్ణించారు.

ఇక, బహుమతి పంపిణీ కార్యక్రమంలో.. - హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ సతీమణి డాక్టర్ సాధన ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  ఆమె రైడర్‌లను ప్రోత్సహించారు. స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, ప్రకృతి అందించే హిడెన్ జెమ్స్‌ను కనుగోవడానికి సహాయపడే ఇలాంటి ఈవెంట్‌లను నిర్వహించినందుకు హిమాలయన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ టూరిజం ప్రమోషన్ అసోసియేషన్, ఇతర నిర్వాహకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఈవెంట్స్ జంజెహ్లీ వంటి గ్రామాలకు పర్యాటకం, ఉపాధిని తీసుకొచ్చాయని ఆమె అన్నారు.

click me!