అజారుద్దీన్ నుండి శిఖర్ ధావన్ వరకు... భార్యలకు విడాకులిచ్చిన ఇండియన్ క్రికెటర్లు వీరే...

First Published Sep 8, 2021, 11:41 AM IST

భారత జట్టు స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్-ఆయేషా ముఖర్జీ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు భారత క్రికెటర్లు ఎవరెవరు భార్యలకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్నారో ఓ లుక్కెద్దాం.  


హైదరాబాద్: టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌-ఆయేషా ముఖర్జీ దంపతులు విడిపోతున్నారన్న వార్త ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. తాను ధవన్ విడిపోతున్నట్లు స్వయంగా ఆయేషా ఇన్స్టాగ్రామ్ లో ప్రకటించింది. ఈ విడాకుల ప్రకటనతో టీమిండియా క్రికెటర్లు ఎవరెవరు తమ భార్యలకు విడాకులిచ్చారన్న విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. 

మెల్ బోర్న్ బాక్సర్ అయిన ఆయేషా ముఖర్జీతో ఇండియన్ క్రికెటర్ ధావన్ ప్రేమలో పడ్డాడు. దీంతో 2012 లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆయేషాకి ముఖర్జీకి గతంలోనే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నారు. శిఖర్ ధావన్ తో వివాహం జరిగాక 2014లో వారికి ఒక బాబు( జొరావర్) పుట్టాడు. దాదాపు 9 ఏళ్ల అనంతరం శిఖర్, ఆయేషా దంపతులు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. 

అయితే ఇండియన్ క్రికెటర్లలో ఇలా భార్యకు విడాకులిచ్చిన క్రికెటర్లు మరికొందరు వున్నారు. హైదరాబాదీ క్రికెటర్ అజారుద్దిన్ నుండి ఇప్పటి శిఖర్ ధావన్ వరకు చాలామంది క్రికెటర్లు భార్యలకు విడాకులిచ్చారు. 

భారత జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ అయితే ఇద్దరు భార్యలకు విడాకులిచ్చాడు. ఇద్దరు పిల్లలు పుట్టినతర్వాత మొదటి భార్య నౌరీన్ కు విడాకులిచ్చిన అజార్ భాలీవుడ్ నటి సంగీత బిజ్లానీని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెతోనూ 2010లో అజహర్ విడాకులు తీసుకున్నారు.

అజారుద్దీన్ మొదటి భార్య సంతానమే అయాజుద్దీన్, అసద్. 2011 సెప్టెంబరు 11 న ఔటర్ రింగ్ రోడ్డులో పుప్పాలగూడ వద్ద జరిగిన బైక్ ప్రమాదంలో అయాజుద్దీన్  తీవ్రంగా గాయపడి చనిపోయాడు.

ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ చిన్ననాటి స్నేహితురాలు నోయెల్లా లూయిస్ ను పెళ్లిచేసుకున్నాడు. ఆ తర్వాత నోయెల్లాకు విడాకులిచ్చి మాజీ మోడల్ ఆండ్రియా హెవిట్ ను వివాహమాడాడు.  

భారత జట్టులో మంచి బౌలర్ గా రాణించిన మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ కూడా భార్య జ్యోత్స్నకు 2008లో విడాకులిచ్చాడు.  ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ రిఫరీగా ఉన్న శ్రీనాథ్ జర్నలిస్ట్ మాధవి పాత్రావలిని వివాహం చేసుకున్నారు.

ఇక ప్రస్తుత టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తిక్ కూడా 2007 నికిత వంజరను పెళ్లిచేసుకొని 2012 విడాకులిచ్చాడు. ఈ తర్వాత ఇండియన్ స్క్వాష్ ప్లేయర్ దిపికా పల్లికల్ ను 2015 లో వివాహమాడాడు.    

click me!