పీవీ సింధు బయోపిక్‌లో దీపికా పదుకొనే... బ్యాడ్మింటన్ ప్లేయర్‌తోనే ప్రాక్టీస్ చేస్తున్న పద్మావతీ...

First Published Sep 22, 2021, 8:28 PM IST

బాలీవుడ్‌లో ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెస్ ధోనీ, మెరీ కోమ్, సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్, మిల్కా సింగ్ వంటి క్రీడాకారుల బయోపిక్స్ బాలీవుడ్‌లో విడుదలై, మంచి సక్సెస్ సాధించాయి... ఇప్పుడీ లిస్టులో ఒలింపిక్ విన్నర్ పీవీ సింధు కూడా చేరింది...

ఇప్పటికే బీసీసీఐ బాస్, మాజీ భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా బయోపిక్‌కి అమోదం తెలిపాడు. దాదా బయోపిక్ కోసం నిర్మాత కూడా ఖరారయ్యారు....

2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన పీవీ సింధు, 2020 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించి... ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొట్టమొదటి భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసింది...

ఒలింపిక్ మెడల్స్‌తో పాటు వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఏసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ ఇలా భారత్‌కి పతకాల పంట పండించిన తెలుగు తేజం పీవీ సింధుకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు...

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పీవీ సింధు, జీవితకథలో పెద్దగా చెప్పుకోదగిన మలుపులేమీ ఉండవు. అయితే బ్యాడ్మింటన్ స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆమె పడిన మానసిక సంఘర్షణ, ప్రాక్టీస్, ప్రపంచ ఛాంపియన్‌లపై ఆమె సాధించిన విజయాలతో బయోపిక్ తీయాలని బాలీవుడ్‌లో ప్రయత్నాలు జరుగుతున్నాయి...

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, తన స్నేహితురాలు పీవీ సింధు బయోపిక్‌లో నటించాలని తెగ ఆసక్తిగా ఉంది. నటిగానే కాకుండా... పీవీ సింధు బయోపిక్‌ని నిర్మించాలని కూడా దీపికా పదుకొనే ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం...

ఇప్పటికే ‘చెప్పాక్’ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన దీపికా పదుకొనే, కపిల్‌దేవ్ బయోపిక్ ‘83’ మూవీకి కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తోంది... 

పీవీ సింధు బయోపిక్‌లో నటించేందుకు ఇప్పటికే మానసికంగా, శారీరకంగా సిద్ధమవుతోన్న దీపికా పదుకొనే, ఆమెతో కలిసి బ్యాడ్మింటన్‌ ప్రాక్టీస్ చేస్తూ, మెలకువలు నేర్చుకుంటోంది...

ఇప్పటికే బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్  మూవీ  ‘సైనా’ బాక్సిఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది...

పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ‘సైనా’కి బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు కూడా దక్కలేదు. కేవలం రూ.కోటిన్నర మాత్రమే వసూలు చేసి, డిజాస్టర్‌గా మిగిలింది...

అయితే పరిణితీ చోప్రాతో పోలిస్తే దీపికా పదుకొనేకి స్టార్ వాల్యూ ఎక్కువ. ఆమె నటించిన ఆఖరి సినిమా ‘చెప్పాక్’ మూవీకి పాజిటివ్ టాక్ రాకపోయినా దాదాపు రూ.24 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా నిలిచింది...

అదీకాకుండా సైనా నెహ్వాల్‌తో పోలిస్తే పీవీ సింధుకి క్రేజ్, ఫ్యాన్స్ ఎక్కువ. ఆమె బయోపిక్‌పై జనాలు ఆసక్తి చూపిస్తారని... సరైన డైరెక్టర్‌తో డీల్ చేస్తే, పీవీ సింధు బయోపిక్ సూపర్ సక్సెస్ అవుతోందని భావిస్తోందట దీపికా పదుకొనే...

అదీకాకుండా సైనా నెహ్వాల్‌తో పోలిస్తే పీవీ సింధుకి క్రేజ్, ఫ్యాన్స్ ఎక్కువ. ఆమె బయోపిక్‌పై జనాలు ఆసక్తి చూపిస్తారని... సరైన డైరెక్టర్‌తో డీల్ చేస్తే, పీవీ సింధు బయోపిక్ సూపర్ సక్సెస్ అవుతోందని భావిస్తోందట దీపికా పదుకొనే...

click me!