Ramayan: రావణాసురుడి కుమార్తె, హనుమంతుడిని ప్రేమించిందా?

Published : May 21, 2025, 06:51 PM IST

రామాయణంలో రావణాసురుడికి  కుమారులు ఉన్నారని అందరికీ తెలుసు. కానీ, ఆయనకు ఒక కుమార్తె కూడా ఉందని మీకు తెలుసా? అసలు ఆమె కథేంటి?  

PREV
17
రావణాసురుడి కుమార్తె ఎవరు?

వాల్మీకి రామాయణం, రామచరిత మానస్ లో రావణాసురుడి గురించి మాత్రమే కాదు, ఆయన కుమారుల ప్రస్తావన కూడా ఉంటుంది. మేఘనాథ్, అక్షయ్ కుమార్ , ప్రహస్థ అనే ముగ్గురు కుమారులతో పాటు.. రావణాసురిడికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని థాయిలాండ్, కంబోడియా వంటి దేశాల్లో  దేవతగా పూజిస్తారు. 

27
రావణాసురుడికి ఎందరు కూతుళ్లు

రావణుడి కూతుళ్ల ప్రస్తావన ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, దక్షిణ భారత జానపద కథల్లో ఉంది. రావణుడికి స్వర్ణ మత్స్య, కుంభిని అనే ఇద్దరు కూతుళ్లు. స్వర్ణ మత్స్య ను సువర్ణాంచల అని కూడా పిలుస్తారు. ఆమెను  థాయిలాండ్, కంబోడియాల్లో పూజిస్తారు.

37
స్వర్ణ మత్స్య

థాయిలాండ్ రామకీన్ రామాయణం, కంబోడియా రామకేర్ రామాయణంలో స్వర్ణ మత్స్య  ప్రస్తావన ఉంది. ఆమె శరీరం బంగారంలా మెరిసిపోయేదని, ఆమెను బంగారు మత్స్యకన్య అని కూడా పిలిచేవారని చెబుతారు.

47
హనుంతుడిని ప్రేమించిన రావణుడి కుమార్తె?
థాయిలాండ్, కంబోడియా రామాయణాల ప్రకారం, రావణుడి కూతురు స్వర్ణ మత్స్య హనుమంతుడిని ప్రేమించింది. వానర సైన్యం లంకకు వెళ్లడానికి సముద్రంలో రాళ్లు వేసి వంతెన కడుతుంటే, మొదట్లో ఆ రాళ్లు అదృశ్యమయ్యేవి.
57
రామసేతు నిర్మాణం
హనుమ సముద్రంలోకి వెళ్లి చూస్తే, రావణుడి కూతురు స్వర్ణ మత్స్య రామసేతు నిర్మాణం ఆపడానికి ఇలా చేస్తోందని తెలిసింది. హనుమ ఆమెను ఒప్పించి, రాళ్లు తిరిగి ఇప్పించాడు. దాంతో రామసేతు పూర్తయింది.
67
స్వర్ణ మత్స్య విగ్రహాలు
థాయిలాండ్, కంబోడియా దేవాలయాల్లో స్వర్ణ మత్స్య విగ్రహాలు కనిపిస్తాయి. అక్కడి ప్రజలు ఆమెను పూజిస్తారు. హనుమ, స్వర్ణ మత్స్యల ప్రేమకథను చాలా దేవాలయాల్లో చిత్రించారు.
77
అదృష్ట దేవత
థాయిలాండ్, కంబోడియాల్లో స్వర్ణ మత్స్యను అదృష్ట దేవతగా భావిస్తారు. ఆమె విగ్రహాలను అక్కడి దుకాణాల్లో అమ్ముతారు. ప్రజలు వాటిని ఇళ్లకు తెచ్చుకుని అదృష్ట చిహ్నంగా ఉంచుకుంటారు.
Read more Photos on
click me!

Recommended Stories