Astrology: శ‌ని సంచారంలో మార్పు.. జూన్ 7 నుంచి ఈ 5 రాశుల వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

Published : May 19, 2025, 06:59 PM IST

శ‌నిగ్ర‌హం చాలా శ‌క్తివంత‌మైంద‌ని చెబుతుంటారు. శ‌ని సంచారం మార్పుల‌తో జీవితాల్లో ఊహించ‌ని మార్పులు వ‌స్తాయి. ఈ క్ర‌మంలోనే జూన్ 7 త‌ర్వాత కొన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు రానున్నాయి. ఇంత‌కీ ఆ రాశులు ఏంటంటే.. 

PREV
16
శనిగ్రహ ప్రభావం

శనిగ్రహం ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. ఈ ఏడాది మార్చి 29న శని కుంభరాశిని విడిచిపెట్టి మీనరాశిలోకి ప్రవేశించాడు. అనంతరం ఏప్రిల్ 28న ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. 

మే 26న శని జయంతి అనంతరం 11వ రోజున, శని ఉత్తరాభాద్ర నక్షత్రం రెండవ పాదంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ మార్పు జూన్ 7, శనివారం జరగనుంది. ఈ శని సంచార మార్పు 5 రాశుల జీవితాల్లో ముఖ్యమైన పాజిటివ్‌ పరిణామాలు తీసుకురాబోతుంది. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

26
కన్యా రాశి: పెళ్లిళ్లు, ప్రేమలో విజయం

శని మార్పుతో కన్యా రాశి వారి జీవితం గమనాన్ని మార్చే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపార విస్తరణలో విజయం సాధించగలుగుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు సాఫీగా పూర్తవుతాయి.

36
కర్కాటక రాశి: ఆస్తి, వ్యాపార అభివృద్ధి

ఈ రాశివారికి శని తాజా సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో గణనీయమైన పురోగతి సాధించగలుగుతారు. ఉద్యోగాలలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు ల‌భిస్తుంది. కుటుంబంతో అనుబంధం బలపడుతుంది. ఇల్లు, వాహనం వంటి ఆస్తులను విక్ర‌యించే అవ‌కాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

46
మకర రాశి: ఆర్థిక లాభాలు, సంబంధాలు మెరుగుదల

ఇప్పటి వరకు ఎదురైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుతారు. వివాదాల నుంచి దూరంగా ఉండే అవకాశముంది. వ్యక్తిగత సంబంధాలు కొత్త రూపం దాలుస్తాయి. కుటుంబంతో కలిసిమెలిసి గడిపే సానుకూల కాలం ఇది. ఉద్యోగంలో పేరు, ప్రాముఖ్యత పెరుగుతుంది.

56
కుంభ రాశి: కోరికలు నెరవేరు, పదోన్నతి అవకాశాలు

శని స్వగృహమైన కుంభంలోకి ఉత్తరాభాద్ర రెండవ పాదంలో ప్రవేశం వీరికి ఎంతో శుభప్రదం. నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. కోరికలు నెరవేరే అవకాశాలున్నాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంటుంది.

66
తులా రాశి: వృత్తి పురోగతి, కుటుంబ శాంతి

ఈ రాశివారు శనిగ్రహ మార్పుతో ఉద్యోగ‌ జీవితంలో మంచి పురోగతి చూస్తారు. కొత్త అవకాశాలు ఎదురవుతాయి. వృద్ధి లక్ష్యంగా వ్యాపార అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీ శ్రమకు సరైన ఫలితం లభిస్తుంది. ఓపికగా ముందడుగు వేస్తే ఆశించిన ఫలితాలు పొందవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories