సింహరాశి
ప్రేమలో ఉన్నత శిఖరాలు చేరతారు. ప్రేమించిన వ్యక్తుల కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడతారు. వీళ్ల వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, నిజాయతీగా ఉండే తత్వంతో ఇతరులను త్వరగా ఆకర్షిస్తుంటారు. తమకు నచ్చినవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదలరు.
మిథున రాశి
మంచి మాటకారులు. మాటలతోనే ఇతరులను తమవైపు తిప్పుకొంటారు. కఠిన సమయంలో ఇలాంటి వ్యక్తులు నా పక్కన ఉంటే బాగుంటుంది అనుకునేంతగా ఆకట్టుకుంటారు. వీళ్లతో ప్రేమలో పడినవారికి సమయం తెలియనంతగా సరదాగా గడిచిపోతాయి రోజులు.
తులా రాశి
ఈ రాశి వారితో ప్రేమలో పడ్డవారు లక్కీ. ఇష్టపడ్డవారిని వీళ్లు దైవంలా ఆరాధిస్తారు. వాళ్ల కోసం సర్వం వదులుకోవడానికి సిద్ధపడుతుంటారు. వీళ్లు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ప్రేమించిన వారిని క్షణం వదిలి ఉండరు. ఈ మనస్తత్వానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.
వృషభ రాశి
మంచి పద్ధతి, తీరైన ప్రవర్తకు చిరునామా ఈ రాశి వారు. ఒక్కమాటలో చెప్పాలంటే మర్యాద రామన్నలు. వీళ్ల పక్కనుంటే జీవితం సంతోషంగా గడిచిపోతుంది అనేంతగా భరోసా కల్పిస్తారు. కేవలం తమ ప్రవర్తనతోనే ఇతరులను ఆకర్షిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ప్రేమ ఇవ్వడమే తప్ప ఆశించడం తెలియదు. ప్రేమించిన వారితో మనస్ఫూర్తిగా ఉంటారు. వాళ్ల బాగోగుల కోసం తపిస్తారు. వీళ్ల ప్రేమను తెలుసుకోవడం కొంచెం ఆలస్యమైనా, తెలుసుకున్నాక ఎవరూ వీళ్లని వదులుకోవడానికి ఇష్టపడరు.
మీన రాశి
వీళ్లు రొమాంటిక్ ఫెలోస్. వీళ్లతో ప్రేమలో పడితే స్వర్గం చూపిస్తారు. ప్రేమికులతో జాలీగా ఉంటారు. లవర్స్ కి అడక్కుండానే అన్నీ అమర్చి పెడతారు. వీళ్లతో ప్రేమలో పడినవారికి పండగే.