ఆచార్య చాణక్యుడు మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో బోధనలు చేశాడు. ఆయన నీతి సూత్రాల్లో ప్రేమ, పెళ్లి, స్నేహం ఇలా చాలా విషయాల గురించి వివరించాడు. మరీ ముఖ్యంగా సంతోషకరమైన దాంపత్య జీవితం కోసం భార్యా భర్త ఎలా ఉండాలో తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు. చాణక్యుడి ప్రకారం భార్యా భర్తలు తమ రోజును ఎలా ప్రారంభిస్తే వారు సంతోషంగా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు ఉదయం లేవగానే ఏదో ఒక పని కలిసి చేయాలి. ఇది వారి మొత్తం రోజును ప్రభావితం చేస్తుందట. వారి జీవితం సంతోషంగా ఉండేలా చేస్తుందట.
ప్రేమతో మొదలు పెట్టాలి!
చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు తమ రోజును ప్రేమతో మొదలుపెట్టాలి. అంటే ఉదయం లేవగానే ఒకరినొకరు హగ్ చేసుకోవడం ద్వారా వారి ప్రేమను వ్యక్తపరుచుకోవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
ఉదయాన్నే లేవాలి
భార్యా భర్తలు ఇద్దరు వేకువజామునే లేవడం మంచిదని చాణక్య నీతి చెబుతోంది. దానివల్ల శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుందట. దేవుడి ఆశీస్సులు పొందడానికి రోజును త్వరగా ప్రారంభించడం మంచిదని చాణక్యుడి బోధనలు చెెబుతున్నాయి.
తులసికి నీళ్లు
ఉదయం స్నానం చేశాక భార్యాభర్తలు కలిసి తులసికి నీళ్లు సమర్పిస్తే.. వారి బంధం జీవితాంతం బాగుంటుందట. దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవట.
యోగా..
భార్యాభర్తలు ఉదయం కలిసి యోగా చేయాలి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతుంది. మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది చాలా మంచిది.