జీవిత భాగస్వామి అనే విషయం పక్కన పెడితే ముఖ్యంగా ఎదుటి మనిషిని గౌరవించడం ప్రశంసించడం కృతజ్ఞత చూపించడం వంటివి చేస్తే బయట వాళ్లే మన ప్రవర్తనకి ఫిదా అయిపోతారు. అలాంటిది జీవిత భాగస్వామి ఫిదా కావడంలో ఆశ్చర్యం ఏముంది.
ఏం చేస్తే మన జీవిత భాగస్వామి మన ప్రేమలో పడిపోతారో చూద్దాం. భాగస్వామిని అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉండాలి. వారంటే మీకు ఎంత ప్రేమ వారికి అర్థమయ్యే విధంగా ప్రవర్తించాలి. మీరిచ్చే సర్ప్రైజ్ చిన్నదా పెద్దదా అనేది విషయమే కాదు.
అది మీ ప్రేమను వ్యక్తం చేయడానికి ఒక మార్గం మాత్రమే. భాగస్వామి తప్పు చేసినప్పుడు కేకలు వేయకుండా ఓపికగా వారు చేసిన తప్పుని తెలియచెప్పండి అంతేగాని దెప్పిపొడవకండి. కుదిరితే వారు చేసిన తప్పుని క్షమించగలిగితే ఇంకా మంచిది.
ప్రేమను మన చేతల్లోనే కాదు శారీరకంగా కూడా చూపించవచ్చు. మీ భాగస్వామికి మీ ప్రేమను తెలియపరచడం కోసం ఒక చిన్న కౌగిలింత లేదా ఒక చిన్న ముద్దు పెట్టి చూడండి. మీరు చూపించే ఎఫెక్షన్ కి మీ భాగస్వామి మీ ప్రేమలో కచ్చితంగా పడి తీరుతారు.
భాగస్వామి యొక్క మూడ్ కి అనుగుణంగా వారి ఆశలు, ఆకాంక్షలు అందుకోవటంలో మద్దతునివ్వండి. అలాగే మీ భాగస్వామి ఏదైనా పని చేసినప్పుడు వారిని ప్రశంసించటంలో ఏమాత్రం వెనకడుగు వేయకండి. మీరు చేసే చిన్ని ప్రశంస వారి మనసులో మీకు గొప్ప స్థానాన్ని ఇస్తుంది.
అలాగే వారికి నచ్చిన వంట చేసి పెట్టడం వలన కూడా వారు మీకు ఫిదా అయిపోతారు. అలాగే వారు మీ కోసం చేసేది చిన్న పని అయినప్పటికీ కృతజ్ఞతలు చెప్పండి.అది వాళ్లకి ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. మీ కోసం మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది.