Toxic Love Psychology: సైకాలజీ ప్రకారం టాక్సిక్ లవ్ ఎలా ఉంటుంది? వారిని ఎలా గుర్తించాలి?

Published : Jan 26, 2026, 05:20 PM IST

ప్రేమ అందరి జీవితంలో ఒకేలా ఉండదు. కొన్ని ప్రేమలు బయటకు బాగా కనిపిస్తాయి. కానీ లోపల మాత్రం ఆత్మవిశ్వాసాన్ని, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయి. అలాంటి ప్రేమనే టాక్సిక్ లవ్ అంటారు. అసలు టాక్సిక్ లవ్ ఎలా ఉంటుంది? వారి గురించి సైకాలజీ ఏం చెప్తోందో చూద్దాం.

PREV
18
Toxic Love Psychology

సైకాలజీ ప్రకారం.. ప్రేమ అనేది మనసుకు భద్రత, ప్రశాంతత, సంతోషాన్ని ఇవ్వాలి. కానీ కొన్నిసార్లు ప్రేమ పేరుతో మనసును గాయపరిచే సంబంధాలు ఏర్పడుతుంటాయి. ఇలాంటి సంబంధాలనే టాక్సిక్ రిలేషన్ షిప్స్ అంటారు. టాక్సిక్ లవ్ బయటికి చాలా బాగానే కనిపించవచ్చు. ఎక్కువ కేర్ చేస్తున్నట్లు, ఎక్కువ ప్రేమిస్తున్నట్టు అనిపించవచ్చు. కానీ లోతుగా చూస్తే మాత్రం, ఆ ప్రేమ మన ఆత్మవిశ్వాసాన్ని, స్థిరత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది.

28
ఒక్కసారిగా ముఖ్యమైన వ్యక్తిగా మారిపోవడం

సైకాలజీ ప్రకారం టాక్సిక్ లవ్‌లో ఉన్న వ్యక్తి చాలా ఆకర్షణీయంగా ఉంటాడు. ఎక్కువ అటెన్షన్ ఇస్తాడు. మన జీవితంలో ఒక్కసారిగా ముఖ్యమైన వ్యక్తిగా మారిపోతాడు. అంటే, ఎక్కువ ప్రేమ, ఎక్కువ మాటలు, ఎక్కువ హామీలు ఇస్తాడు. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. ఇది ఎదుటి వ్యక్తిని భావోద్వేగంగా తమపై ఆధారపడేలా చేయడానికి ఉపయోగించే ఒక పద్ధతి మాత్రమే. ఒకసారి మనం ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయాక, ఆ ప్రేమ క్రమంగా కంట్రోల్‌గా మారుతుంది.

38
కంట్రోల్ చేయడం

టాక్సిక్ లవ్‌లో ముఖ్యమైన లక్షణం కంట్రోల్. సైకాలజీ ప్రకారం, టాక్సిక్ వ్యక్తులు తమ పార్ట్నర్ జీవితాన్ని నియంత్రించాలనుకుంటారు. ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడకూడదు? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే నిర్ణయాలు కూడా వాళ్లే తీసుకోవాలనుకుంటారు. మొదట ఇది నీ మంచికోసం అని చెప్తారు. కానీ కాలక్రమేణా మన స్వేచ్ఛ తగ్గిపోతుంది. మన నిర్ణయాలపై మనకే నమ్మకం తగ్గిపోతుంది.

48
గ్యాస్ లైటింగ్

మరొక ముఖ్యమైన లక్షణం గ్యాస్‌లైటింగ్. అంటే, మనకు జరుగుతున్నది తప్పే కాదు అని మనకే అనిపించేలా చేయడం. “నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు”, “నువ్వు చాలా సెన్సిటివ్”, “ఇది అంత పెద్ద విషయం కాదు” వంటి మాటలతో మన భావాలను చిన్నచూపు చూస్తారు. సైకాలజీ నిపుణుల ప్రకారం, గ్యాస్‌లైటింగ్ వల్ల మనం మన భావాలపై, మన ఆలోచనలపై అనుమానం పెట్టుకోవడం మొదలుపెడతాం. చివరకు తప్పు మనదే అనుకొని, ఆ టాక్సిక్ వ్యక్తినే క్షమిస్తూ ఉంటాం.

58
షరతులతో కూడిన ప్రేమ

టాక్సిక్ లవ్‌లో ప్రేమ షరతులతో ఉంటుంది. మనం వాళ్లకు నచ్చినట్టు ఉన్నప్పుడే ప్రేమ కనిపిస్తుంది. వాళ్లకు నచ్చని పని చేస్తే, మౌనం, ఇగ్నోరెన్స్, కోపం, లేదా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ మొదలవుతుంది. కానీ నిజమైన ప్రేమలో అంగీకారం ఉంటుంది, భయం ఉండదు.

68
ఈ సంకేతం కనిపిస్తే..

మరొక ముఖ్యమైన సంకేతం ఏంటంటే, టాక్సిక్ లవ్‌లో మనం ఎప్పుడూ ఏదో పొగొట్టుకున్నట్లు, అలసిపోయినట్టే ఫీల్ అవుతాం. అంటే మన మనసు ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడూ ఏదో టెన్షన్, ఏదో భయం ఉంటుంది. “ఇప్పుడు వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో?” అనే ఆలోచన మనసులో తిరుగుతూనే ఉంటుంది. సైకాలజీ ప్రకారం, ఒక సంబంధం మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంటే, అది ప్రేమ కాదు.

78
తప్పును ఒప్పుకోరు..

టాక్సిక్ వ్యక్తులు తమ తప్పును ఎప్పుడూ ఒప్పుకోరు. సమస్య వచ్చిన ప్రతిసారి దాన్ని మన మీదే వదిలేస్తారు. మనం ఎంత ప్రయత్నించినా, ఎంత అర్థం చేసుకున్నా, చివరికి మనమే మారాలని ఒత్తిడి పెడతారు. ఇలా మన వ్యక్తిత్వం నెమ్మదిగా మారిపోతుంది. మన అభిరుచులు, ఆనందం, కలలు అన్నీ కరిగిపోతాయి. 

88
హద్దులు పెట్టుకోవడం..

సైకాలజీ ప్రకారం.. ప్రేమ మనల్ని బలంగా చేయాలి, బలహీనంగా కాదు. మనల్ని మనం కోల్పోయేంత ప్రేమ ఎప్పటికీ మంచిది కాదు. అవసరమైతే హద్దులు పెట్టుకోవాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి. ప్రేమ పేరుతో మనసును గాయపరిచే వాళ్ల నుంచి దూరంగా ఉండటమే మంచిదని సైకాలజీ స్పష్టం చేస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories