Garuda Purana : అక్రమ సంబంధాలు పెట్టుకున్నవారికి నరకంలో ఎలాంటి శిక్షలుంటాయి..?

Published : Jan 15, 2026, 12:41 PM IST

భర్తలు తమ భార్యలను దూషిస్తే, వేధిస్తే, ఇతర స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటే నరకంలో ఎలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో తెలుసా? గరుడ పురాణం ప్రకారం ఇలాంటివారికి నరకంలో ఊహించని విధంగా శిక్షలుంటాయి.

PREV
15
అక్రమం సంబంధం పెట్టుకుంటే ఇన్ని శిక్షలా..!

ఏ మతంలో అయినా వివాహాన్ని కేవలం సామాజిక ఒప్పందంగా కాకుండా, పవిత్రమైన ఆధ్యాత్మిక బంధంగా పరిగణిస్తారు. అయితే భార్యభర్తలు ఒకరికొకరు ద్రోహం చేసుకున్నా, అధర్మ మార్గాన్ని ఎంచుకున్నవారి భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం వివరిస్తుంది. 

తమ భార్యలను మోసం చేసేవారు లేదా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకునేవారు అనుభవించే శిక్షలను గరుడ పురాణం వివరిస్తుంది. ఈ పాపానికి గరుడ పురాణంలో వివరించిన శిక్షల గురించి తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుంది. అందుకే గరుడ పురాణం ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవద్దని సలహా ఇస్తుంది. తమ భార్యలను మోసం చేసేవారికి యమరాజు ఎలాంటి భయంకరమైన శిక్షలు విధిస్తాడో తెలుసుకుందాం.

25
కాల్చిన సూదులతో గుచ్చుతారు..

''కామంతో ప్రభావితులై తమ హద్దులు మీరిన పాపులకు ఈ నరకం నిలయం. ఇక్కడికి వచ్చిన ఇలాంటి ఆత్మను ఎర్రగా కాల్చిన లెక్కలేనన్ని ఇనుప సూదులతో గుచ్చుతారు. ఆ నొప్పి భరించలేనిది, పాపి బాధపడుతూనే ఉంటాడు'' అని గరుడ పురాణం పేర్కొంటుంది.

35
చీకటి నరకంలో విసిరేస్తారు...

''నమ్మక ద్రోహం చేసే ఆత్మలను ఈ చీకటి నరకంలోకి విసిరేస్తారు. ఇక్కడ ఒక వ్యక్తిని పదునైన ముళ్ళు, విష జీవులతో నిండిన మార్గంలో మైళ్ళ దూరం చెప్పుల్లేకుండా నడవమని బలవంతం చేస్తారు. చీకటి వల్ల దారి కనిపించక, పదేపదే కిందపడి రక్తస్రావంతో బాధపడతారు'' అని కూడా గరుడ పురాణంలో ఉంది.

45
క్రూర హింసలు..

''నరకంలో ఇనుములా బలమైన, పదునైన దంతాలున్న క్రూరమైన, భారీ జీవులు ఉంటాయి. ఈ జీవులు పాపి శరీరాన్ని చీల్చి నములుతాయి. పాప కర్మల లెక్క తీరే వరకు ఈ శిక్ష కొనసాగుతుంది'' అంటోంది గరుడ పురాణం.

55
బార్యను వేధించినా నరకమే..

గరుడ పురాణం దాంపత్య ద్రోహాన్నే కాకుండా భార్యను మానసికంగా, శారీరకంగా హింసించడాన్ని కూడా తీవ్రమైన పాపంగా వర్గీకరిస్తుంది. కారణం లేకుండా భార్యను వేధించే లేదా ఆమెపై చేయి చేసుకునే వారిని నరకాగ్నిలో పడేస్తారు. ఇలా ఒక పురుషుడు తన భార్యకు కలిగించే నొప్పికి వెయ్యి రెట్లు శిక్షను యమదూతలు విధిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శిక్ష కొన్ని రోజులు కాదు, వేల లేదా లక్షల సంవత్సరాల పాటు ఉంటుంది. ఆత్మ తన పాపాల ఫలాలను పూర్తిగా అనుభవించే వరకు, దానికి పునర్జన్మ లేదా మోక్షం లభించదు.

Read more Photos on
click me!

Recommended Stories