శృంగారం పట్ల అయిష్టత పెరుగుతోందా..? ఇలా ప్రయత్నించండి..!

First Published | Mar 2, 2022, 12:15 PM IST

తమలో కోరికలు తగ్గడానికి గల కారణాలేంటి.. దానికి ఎలాంటి మార్గాలు పాటించాలి అని కొన్ని విషయాల్లో అవగాహన పెంచుకోవడం ముఖ్యం. 


ఏ వయసువారికైనా శృంగారం శారీరక, మానసిక ఉత్తేజానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది. చక్కటి శృంగారం ఆ జంట మధ్య అన్యోన్యమైన సంబంధాలకు దారి తీస్తుంది. వారి రిలేషన్ షిప్ దీర్ఘకాలం అద్భుతంగా కొనసాగడానికి తోడ్పడుతుంది.

sexual relation

అయితే మహిళల్లో పెళ్లైన కొత్తలో ఉన్న శంగారేచ్ఛ... రోజులు గడిచిన కొద్దీ తగ్గిపోతుంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయి. అయితే ఇదే భాగస్వామి మరో సంబంధం కోసం దిక్కులు చూసేలా చేస్తుంది.

Latest Videos


sex

తమ అనుబంధానికి విఘాతంలా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. తమలో కోరికలు తగ్గడానికి గల కారణాలేంటి.. దానికి ఎలాంటి మార్గాలు పాటించాలి అని కొన్ని విషయాల్లో అవగాహన పెంచుకోవడం ముఖ్యం. 

కోరికలు తక్కువగా ఉండే మహిళలకు అతి చక్కటి మార్గం సెక్స్ కౌన్సిలింగ్. సెక్స్ విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల మహిళల్లో శృంగారేచ్ఛ తగ్గుతుంది. ఇది వారి భాగస్వామి మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా వారి అనుబంధం దెబ్బతినేవరకు వెడుతుంది.

తమ అనుబంధానికి విఘాతంలా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే.. తమలో కోరికలు తగ్గడానికి గల కారణాలేంటి.. దానికి ఎలాంటి మార్గాలు పాటించాలి అని కొన్ని విషయాల్లో అవగాహన పెంచుకోవడం ముఖ్యం. 

క్రమం తప్పని వ్యాయామం : స్త్రీల మనసు, శరీరం చురుకుగా లేకపోవడం కూడా కోరికలు తగ్గడానికి ఓ ముఖ్యమైన కారణమే. దీంతో ఈ ప్రభావం వారి లైంగిక జీవితంపై అధికంగా ఉంటుంది.

sex addiction

దీన్ని పెంచుకోవడానికి ఏరోబిక్ ఎక్సర్ సైజుల వల్ల శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇది అటోమెటిగ్గా చురుకుదనాన్ని పెంచుతుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల శృంగార కోరికల్లో మార్పు వస్తుంది. మిమ్మల్ని రతి క్రీడకు సిద్ధం చేస్తుంది. 

మహిళలు ముఖ్యంగా తొందరగా ఒత్తిడికి గురవుతారు. ఆఫీసు విషయాలు, ఇంటి విషయాలు, ఆర్థిక సంబంధాలు ఇలా మహిళలు అనేక విషయాల్లో వెంటనే మనసు మీదికి తీసుకుంటారు. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. ఇది లైంగిక జీవితంపై ప్రభావం చూపిస్తుంది. 

ఒత్తిడిని కంట్రోల్ చేసుకోగలిగితే శృంగార జీవితం అద్భుతంగా మారిపోతుంది. ప్రశాంతమైన మానసిక స్థితి రతిక్రీడలో మిమ్మల్ని మహారాణిని చేస్తుంది. మీ భాగస్వామికి స్వర్గాన్ని చూపిస్తుంది. 

నేటి బిజీ జీవితంలో శృంగారానికి టైం ఉండడం లేదు. ఇది కూడా కోరికలు తగ్గడానికి మరో ముఖ్యకారణమే. అయితే అదే సమయంలో మీ అనుబంధాన్ని కాపాడుకోవడం.. మీ భాగస్వామితో మంచి రిలేషన్ మెయింటేన్ చేయడం కూడా ముఖ్యమే. 
 

sex

అందుకే శృంగారానికి ప్రత్యేకంగా ఓ టైం కేటాయించండి. షెడ్యూల్ ఉండడం వల్ల ముందుగానే మీ మనసులో దాని గురించిన ఆలోచన మొదలవుతుంది. ఇది మీలో కోరికల్ని మెల్లమెల్లగా తట్టిలేపి... ఆ సమయానికి మిమ్మల్ని సమాయత్తం చేస్తుంది. 

జంటల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ కూడా స్త్రీలలో కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. రోజువారీ పనులు, ఆఫీసు వ్యవహారాలు, ట్రాఫిక్.. ఇలాంటి అనేక కారణాలతో భాగస్వాములు కూర్చుని మాట్లాడుకునే సమయం దొరకదు. ఇక లైంగిక సంబంధమైన సమస్యలు మాట్లాడుకోవడానికి అసలు అవకాశం ఉండదు.
 

దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. ఈ గ్యాప్ శృంగార జీవితంపై పడుతుంది. టైం దొరకడం లేదని కాకుండా.. టైం చేసుకుని ఇద్దరూ కూర్చుని సరదాగా మాట్లాడుకోవడం. ఎలాంటి సెక్స్ ఇష్ట పడతారు అనే విషయాలు చర్చించుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బైటపడవచ్చు. 

SEX

తక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం కూడా శృంగార కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. ఎప్పుడో చుక్క తెగిపడినట్టు కలయికలో పాల్గొనడం కాకుండా, మీ భాగస్వామితో ఏదోరకంగా శారీరక సంబంధంలో ఉండడం తనలో కోరికల్ని పెంచడానికి తోడ్పడుతుంది. 

తక్కువ సార్లు సెక్స్ లో పాల్గొనడం కూడా శృంగార కోరికలు తగ్గడానికి కారణమవుతాయి. ఎప్పుడో చుక్క తెగిపడినట్టు కలయికలో పాల్గొనడం కాకుండా, మీ భాగస్వామితో ఏదోరకంగా శారీరక సంబంధంలో ఉండడం తనలో కోరికల్ని పెంచడానికి తోడ్పడుతుంది. 
 

Sex-related

ముద్దులు పెట్టడం, చేతులు పట్టుకుని మాట్లాడడం, ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం.. కౌగిలించుకోవడం లాంటివి తరచుగా చేస్తుంటే స్త్రీలలో శృంగార కోరికలు ఈజీగా పెరుగుతాయి 

click me!