మీకు డయాబెటీస్ ఉందా? సెక్స్ లైఫ్ లో సమస్యలు రావొద్దంటే ఇలా చేయాల్సిందే..!

First Published | Nov 14, 2023, 3:40 PM IST

world diabetes day 2023: డయాబెటిస్ మొత్తం ఆరోగ్యాన్నే కాదు మీ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అవును మగవారైనా, ఆడవారైనా.. ఇది ఇద్దరిలో ఎన్నో లైంగిక సమస్యలను కలిగిస్తుంది. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలను తప్పకుండా తీసుకోవాలి. 

డయాబెటిస్ కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పెద్దవయసు వారు మాత్రమే దీని బారిన పడేవారు. ఇప్పుడు చిన్న వయసు వారు కూడా షుగర్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ వల్ల  రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాదు ఎన్నో శారీరక సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు ఈ డయాబెటిస్ మీ లైంగిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది తెలుసా? ఇది ఇద్దరి పునరుత్పత్తి, లైంగిక కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది. 
 

డయాబెటిస్ వల్ల ఆడవారికి యోని పొడిబారే సమస్య రావొచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఇలా అవుతుంది. అంతేకాదు ఇది యోని రక్త నాళాలను కూడా దెబ్బతీస్తుంది. దీనివల్ల లూబ్రికెంట్ ఉండదు. ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొంటే విపరీతమైన నొప్పి కలుగుతుంది. 
 


దీనికితోడు డయాబెటిస్ వల్ల శరీరంలో హార్మోన్ల మార్పు కూడా ఉంటుంది. ఇది లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. డయాబెటిస్ ఉన్న మహిళలకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఎస్టీఐల సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది సాధారణంగా సెక్స్ ను ప్రభావితం చేస్తుంది. డయాబెటీస్ వల్ల పురుషులకు నాడీ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీని వల్ల అంగస్తంభన సమస్యను ఎదుర్కోవచ్చు. అలాగే డయాబెటిస్ వల్ల భావప్రాప్తికి చేరుకోవడం చాలా కష్టం. మరి డయాబెటీస్ రోగులు లైంగిక జీవితాన్ని ఆనందంగా గడపడానికి ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచాలి

డయాబెటిస్ రోగులు ఎప్పుడూ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్న మహిళలు యోని ఆరోగ్యం కోసం రక్తంలో గ్లూకోజ్ ను నార్మల్ గా ఉంచాలి. సాధారణ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నరాలని దెబ్బతీయవు. తగినంత మొత్తంలో రక్తం యోనికి చేరుకోవడానికి సహాయపడతాయి. దీంతో లూబ్రికెంట్ సమస్య కూడా ఉండదు. 
 

 హార్మోన్ల సమతుల్యత కోసం ఆహారాలు 

హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి ఆహారాలపై ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మీ సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరిచే ఆహారాలను కూడా తీసుకోవాలి. జింక్ లిబిడోను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది. దీంతో మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు. 
 

యోని పీహెచ్ 

రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల యోని పీహెచ్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది యూటీఐ వంటి యోని సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే యోని పొడిగా కూడా మారుతుంది. ముఖ్యంగా యోని బ్యాక్టీరియా అసమతుల్యత చెందుతుంది. దీనివల్ల బ్యాక్టీరియా వాగినోసిస్ ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ఈ సమస్యలేమీ రావొద్దంటే పీహెచ్ సమతుల్యతను నిర్వహించడం చాలా ముఖ్యం. వీటి కోసం  సరైన ఆహారాలను తీసుకోవాలి. అలాగే అవసరమైతే గైనకాలజిస్ట్ ను సంప్రదించండి.
 

చక్కెర లేని లూబ్రికెంట్

డయాబెటిస్ రోగులు సెక్స్ సమయంలో లూబ్రికెంట్ ను కూడా ఉపయోగించొచ్చు. ఒకవేళ మీకు డయాబెటిస్ ఉంటే సరైన లూబ్రికెంట్ ను మాత్రమే ఉపయోగించాలి. చాలా లూబ్రికెంట్ లలో గ్లిజరిన్,  గ్లైకాల్ వంటి చక్కెర ఉంటుంది. ఇవి యోని పిహెచ్ ను ప్రభావితం చేస్తాయి. అలాగే ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అందుకే సహజ లూబ్రికెంట్లను మాత్రమే ఉపయోగించండి. 
 

Latest Videos

click me!