ఈ మసాలా దినుసులను తింటే మీ సెక్స్ స్టామినా ఇట్టే పెరిగిపోతుంది తెలుసా?

First Published | Aug 3, 2023, 9:41 AM IST

మీ లైంగిక జీవితాన్ని కొంచెం స్పైసీగా మార్చాలనుకుంటున్నారా? అయితే మీ రోజువారీ ఆహారంలో కొన్ని మసాలా దినుసులను చేర్చాల్సిందేనంటున్నారు నిపుణులు. అవును కొన్ని మసాలా దినుసులు మీ సెక్స్ స్టామినాను పెంచుతాయట. 

these spices can boost your sexual life rsl

మంచి లైంగిక జీవితం మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీకు తెలుసా..? ఒత్తిడి, అలసటకు కూడా ఇది స్ట్రెస్ బస్టర్ గా పనిచేస్తుంది. కొన్నిసార్లు హార్మోన్లలో మార్పుల వల్ల కూడా బాగా అలసిపోతారు. అయితే మీ హార్మోన్లను సమతుల్యంగా ఉంచడానికి కొన్ని మసాలా దినుసులు ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అంతేకాదు ఇవి మీ లైంగిక జీవితానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మీలో సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉంటే ఈ సమాలా దినుసులను తీసుకుంటే సమస్య పోతుందంటున్నారు నిపుణులు. 

వీల్ కార్నెల్ మెడికల్ సెంటర్ నుంచి వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే సుగంధ ద్రవ్యాలు సెక్స్ సామర్థాన్ని పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల నాడీ పనితీరు మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. దీంతో మీ సెక్స్ డ్రైవ్ కూడా పెరుగుతుంది. ఎలాంటి మసాలా దినుసులను తింటే సెక్స్ డ్రైవ్ మెరుగుపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 


Image: Getty Images

లవంగం 

ఈ మసాలా దినుసు మీ శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అంతేకాదు ఇది మీ శరీర ఉష్ణోగ్రతను సాధారణం కంటే కొంచెం ఎక్కువగా పెంచుతుంది. లవంగాలు మీ శక్తిని పెంచుతాయి. అలాగే ఒత్తిడి. యాంగ్జైటీలను కూడా తగ్గిస్తాయి.ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల మీ లైంగిక పనితీరు కూడా పెరుగుతుంది. ఈ మసాలా మీ టెస్టోస్టెరాన్ స్థాయిలను బాగా పెంచుతుంది. ఇది స్త్రీ పురుషులిద్దరి సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి బాగా సహాయపడుతుంది. 

మెంతులు 

మెంతులను సాధారణంగా చాలా వంటల్లో ఉపయోగిస్తారు. వీటి రుచి కాస్త చేదుగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. వీటిని తీసుకోవడం వల్ల లైంగిక వాంఛలు కూడా పెరుగుతాయని తేలింది. మెంతులు మీ రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. అంతేకాదు కొత్తగా తల్లులైన వారిలో పాల ఉత్పత్తిని కూడా పెంచుతాయి. ఈ మెంతులు డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. 

అల్లం 

ప్రతి కూరలో అల్లం వేసేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి దీనిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉన్నాయి. అందుకే అల్లాన్ని టీలల్లో కూడా ఉపయోగిస్తుంటారు. అయితే అల్లం లైంగిక అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందన్న ముచ్చట చాలా మందికి తెలియదు. ఇది మీ సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ సమాలా దినుసు మీ శక్తిని కూడా పెంచుతుంది. ముఖ్యంగా కామసూత్ర చివరి అధ్యాయంలో అల్లం వాడకం గురించి కూడా ప్రస్తావించారు. 
 

సోంపు 

సోంపులో ఈస్ట్రోజెనిక్ ప్రభావాలు ఉంటాయి. ఇది పీరియడ్స్ తిమ్మిరిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది లైంగిక సంతృప్తిని కూడా పెంచుతుంది. రుతువిరతి లక్షణాల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది. అంతేకాదు ఇది మీ జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

దాల్చినచెక్క 

దాల్చినచెక్కను ఖచ్చితంగా తినాలని ఆయుర్వేదం కూడా చెబుతోంది. దాల్చిన దీనిని తీసుకోవడం వల్ల జనేంద్రియలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. దాల్చిన చెక్క మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. ఇది అలసట, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది.

కుంకుమపువ్వు

కుంకుమ పువ్వు ఎంతో ఖరీదైంది. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. కుంకుమపువ్వును తినడం వల్ల మీ లైంగిక కోరిక పెరుగుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. కుంకుమపువ్వు రుతుస్రావానికి ముందు లక్షణాలను తగ్గించడానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. 
 

Latest Videos

click me!