Pain During Sex
చాలా మందిరి సెక్స్ లో పాల్గొన్న తర్వాత లేదా ఉద్వేగం తర్వాత కడుపు తిమ్మిరి లేదా నొప్పి సమస్య వస్తుంది. మీకెప్పుడైనా ఇలా అయ్యిందా? ఈ సమస్య ఇది చాలా మందికి వస్తుంది.. అందుకే భయపడకండి. అయితే దీనికి చిన్న సమస్యలే కాదు పెద్ద పెద్ద సమస్యలు కూడా కారణం కావొచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఈ సమస్య కేవలం ఆడవారికే కాదు మగవారికి కూడా వస్తుంది. మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
భావప్రాప్తి
సెక్స్ సమయంలో లేదా ఆ తర్వాత కడుపు తిమ్మిరి రావడానికి భావప్రాప్తి సర్వసాధారణ కారణం. భావప్రాప్తి పొందిన తర్వాత పొత్తికడుపులో నొప్పిని అనుభవించే వారు చాలా మందే ఉన్నారు. ఎందుకంటే భావప్రాప్తి సమయంలో కటి, కటిఫ్లోర్ కండరాలు వేగంగా సంకోచించిస్తాయి. దీంతో కడుపు నొప్పి వస్తుంది.
Sleep after sex
కండరాల ఒత్తిడి
వ్యాయామం మాదిరిగానే.. సెక్స్ సమయంలో కటి లేదా ఉదర కండరాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల సెక్స్ సమయంలో లేదా తర్వాత మీకు కడుపు నొప్పి లేదా తిమ్మిరిగా అనిపించొచ్చు. గట్టి కండరాలు, నిర్జలీకరణం, దీర్ఘకాలిక అసాధారణ కండరాల స్థానం కడుపు నొప్పిని కలిగిస్తాయి. అయితే దీనివల్ల వచ్చే నొప్పి కొన్ని నిమిషాల్లోనే తగ్గిపోతుంది.
Couples after sex
మూత్ర సమస్యలు
మూత్రాశయం, మూత్ర వ్యవస్థకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే మీకు సెక్స్ తర్వాత నొప్పి కలుగుతుంది. అలాగే మీకు ఇప్పటికే మూత్రాశయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే సంభోగం సమయంలో ఇది మరింత ఎక్కువవుతుంది. ఇద్దరు భాగస్వాములలో ఏ ఒక్కరికైనా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే.. కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది.
సెక్స్ భంగిమలు
చొచ్చుకుపోయే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనడం వల్ల కూడా కడుపు తిమ్మిరి, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గర్భాశయంపై, కడుపు తిమ్మిరి, చికాకు కలుగుతుంది. అలాగే గర్భాశయంలో సంక్రమణ, గాయం ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల కడుపు తిమ్మిరి, నొప్పి సమస్యలు వస్తాయి.
అండోత్సర్గము
ప్రతి నెలా ఆడవారిలో అండాశయ ఫోలికల్ పెరుగుతుంది. దీనిలో పరిపక్వ గుడ్లు నిల్వ చేయబడతాయి. నెల ప్రారంభం కావడానికి 2 వారాల ముందు ఫోలికల్స్ విచ్ఛిన్నమై ఫలదీకరణం కోసం గుడ్లను విడుదల చేస్తాయి. ఈ సమయంలో మహిళలు సెక్స్ లో పాల్గొన్న తర్వాత లేదా సెక్స్ సమయంలో కడుపు తిమ్మిరి, నొప్పిని అనుభవించే అవకాశం ఉంది.
జీర్ణ సమస్యలు
గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల వల్ల కూడా సెక్స్ తర్వాత కడుపునొప్పికి కారణమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ సమస్య ఉన్నవారికి కూడా సెక్స్ తర్వాత కడుపు తిమ్మిరి సమస్య వచ్చే అవకాశం ఉంది.