ఈ 6 పండ్లు చాలు.. మీలో సెక్స్ కోరికలు అమాంతం పెరగడానికి..

First Published | Jul 22, 2023, 12:27 PM IST

పోషకాలు పుష్కలంగా ఉండే కొన్ని పండ్లను తింటే మీ సెక్స్ డ్రైవ్ అమాంతం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఈ పండ్లు మీ లిబిడోను పెంచుతాయి. రక్తప్రవాహాన్ని పెంచి మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మీ స్టామినాను కూడా పెంచి మీ లైంగిక జీవితాన్ని మెరుగ్గా చేస్తాయని పలు అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. 
 

సెక్స్ డ్రైవ్ మెరుగ్గా ఉంటేనే మీ లైంగిక జీవితం సాఫీగా సాగుతుంది. అయితే  ప్రస్తుతం చాలా మంది తక్కువ లిబిడో సమస్యతో బాధపడుతున్నారు. లిబిడో తక్కువగా ఉంటే సెక్స్ కోరికలు తక్కువగా ఉంటాయి. వీరికి లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతి ఒక్కరికీ వారి స్వంత సెక్స్ డ్రైవ్ ఉంటుంది. ఇది సర్వ సాధారణం. అయినప్పటికీ లిబిడో పెరగడానికి, తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని పండ్లు లిబిడో లేదా సెక్స్ డ్రైవ్ పెరగడానికి సహాయపడతాయంటున్నారు నిపుణులు. వీటిని కామోద్దీపనలు అని కూడా పిలుస్తారు. వీటికి లిబిడో పెంచే స్వభావం ఉంటుంది. కామోద్దీపన అనేది లిబిడో, లైంగిక కోరికలు, లైంగిక ఆకర్షణ, లైంగిక ఆనందం లేదా లైంగిక ప్రవర్తనను పెంచే పదార్థం. లైంగిక కోరికలు పెరగడానికి ఎలాంటి పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Image: Getty Images

ఆపిల్స్

రోజుకో ఆపిల్ పండును తింటే హాస్పటల్ కు వెళ్లాల్సిన అవసరం రాదన్న మాటను వినే ఉంటారు. అయితే ఆపిల్ మీ సెక్స్ డ్రైవ్ కు కూడా సహాయపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆపిల్స్ లో క్వెర్సెటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక రకమైన ఫ్లేవనాయిడ్. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంగస్తంభన లోపాన్ని పోగొడుతుంది. అలాగే ప్రోస్టాటిటిస్ లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆపిల్స్ ను ఎక్కువగా తినేవారిలో అంగస్తంభన లోపం 14 శాతం తగ్గిందని 20216 అధ్యయనం వెల్లడించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండే ఫుడ్ మీ మొత్తం ఆరోగ్యాన్ని  మెరుగుపర్చడమే కాకుండా మీ లైంగిక జీవితాన్ని కూడా ఆరోగ్యంగా చేస్తుంది.

Latest Videos


పుచ్చకాయ

పుచ్చకాయల్లో ఎల్-సిట్రులైన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలో ఎల్-అర్జినిన్ గా మారుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎల్-అర్జినిన్ మీ అంగస్తంభనకు సహాయపడుతుంది. ఈ సమ్మేళనం నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అంగస్తంభనలను బలోపేతం చేస్తుంది.

అరటిపండు

అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా చాలా అవసరం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకార.. పొటాషియం మన రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది మీ లైంగిక పనితీరును కూడా పెంచుతుంది. ఇది  మీ జననేంద్రియాలతో సహా శరీరంలోని కొన్ని భాగాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. 
 

దానిమ్మపండు

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ పరిశోధనలో ప్రచురించిన ఒక అధ్యయనం.. దానిమ్మ రసంలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ అధ్యయనం ప్రకారం.. యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే ఇవి అంగస్తంభనను మెరుగుపరచడానికి సహాయపడతాయి. అంతేకాదు కొన్ని జంతు అధ్యయనాలు.. ఈ దానిమ్మ జ్యూస్ దీర్ఘకాలిక అంగస్తంభనను  మెరుగుపరుస్తుందని చూపించాయి.

Avocado

అవొకాడో

అవొకాడోల్లో బి విటమిన్లు, మోనోశాచురేటెడ్ కొవ్వు పుష్కలంగా ఉంటాయి. ఈ అవొకాడో పురుషాంగంతో సహా మీ మొత్తం శరీరానికి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఉండే పొటాషియం పురుషుల్లోనే కాదు మహిళల్లో కూడా లిబిడోను పెంచుతుందని అధ్యయనాలు వెళ్లడిస్తున్నాయి. 

strawberries

స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు

స్ట్రాబెర్రీలు, కోరిందకాయలు వంటి బెర్రీలు కూడా సెక్స్ డ్రైవ్ ను పెంచుతాయి. ఈ పండ్లలో కామోద్దీపన లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పండ్ల విత్తనాలలో జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది పురుషులు, మహిళల్లో సెక్స్ కోరికలను పెంచుతుంది. 

click me!