అమీర్‌ ఖాన్‌ టాలీవుడ్‌ ఎంట్రీ?.. బాక్సాఫీసుకు పూనకాలు తెప్పించే కాంబినేషన్‌

First Published | Nov 25, 2024, 8:34 PM IST

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ ఇప్పటికే కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టబోతున్నారట. ఇదే క్రేజీగా మారింది. 
 

బాలీవుడ్‌ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌.. సినిమాల పరంగా కొంత బ్యాక్‌ అయ్యారు. ఆయన చేసిన సినిమాలు ఇటీవల బ్యాక్ టూ బ్యాక్‌ ఫెయిల్‌ అవుతున్నాయి. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. దీంతో కొంత గ్యాప్‌ తీసుకున్నారు అమీర్‌ ఖాన్‌. హీరోగా తన కొత్త సినిమాని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన చేయబోతున్న సినిమాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అమీర్‌ ఖాన్‌ కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి `కూలీ` సినిమాలో నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్‌తోపాటు నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఆయన నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. ఇందులో అమీర్‌ ఖాన్‌ కూడా నటిస్తున్నారట. ఆయనది కూడా నెగటివ్‌ రోల్‌ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు బిగ్‌ స్టార్స్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. సినిమా కోసం అంతా ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 


Aamir Khan

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అమీర్‌ ఖాన్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తుంది. ఆయన్ని తెలుగులోకి తీసుకురావాలని దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్‌ చేస్తున్నారట.

ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. తన మార్క్ భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించబోతున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఇందులో మరో బలమైన పాత్ర ఉందట. అది మోస్ట్ పవర్‌ ఫుల్‌రోల్‌ అని తెలుస్తుంది. అందులో అమీర్‌ ఖాన్‌ని నటింప చేయాలని భావిస్తున్నారట ప్రశాంత్‌ నీల్‌.  

ఈ మేరకు అమీర్‌ ఖాన్‌ని కలిసి కథ చెప్పాలనుకుంటున్నారట. ఆయన ఒప్పుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇందులో ఆయనది కూడా నెగటివ్‌ రోల్‌ అని సమాచారం. మరి మిస్టర్‌ పర్‌ఫెక్ట్ రియాక్షన్‌ ఎలా ఉండబోతుందో చూడాలి. ఎన్టీఆర్‌ హీరోగా ఇటీవల `దేవర`లో సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్ గా నటించాడు.

ఇప్పుడు `ఎన్టీఆర్‌31`లో అమీర్‌ ఖాన్‌ని దించబోతున్నారట. ఇదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మూవీ కాబోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. బాక్సాఫీసుకి పూనకాలు తప్పవని చెప్పొచ్చు. మరి ఇది సాధ్యమవుతుందా ? అనేది చూడాలి. 
 

మరోవైపు ఎన్టీఆర్‌ మరో బాలీవుడ్‌ సినిమా కూడా చేయబోతున్నారట. ప్రస్తుతం ఆయన బాలీవుడ్‌ హృతిక్‌ రోషన్‌తో కలిసి `వార్‌ 2` సినిమాలో నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌రాజ్‌  స్పై యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇందులో ఎన్టీఆర్‌ విలన్‌గా నటిస్తున్నాడట. దీంతోపాటు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలోనే మరో బాలీవుడ్‌ సినిమాకి తారక్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ఇందులో ఆయనే హీరోగా అని టాక్‌. 

read more:ప్రభాస్‌కి అల్లు అర్జున్‌ ఊహించని గిఫ్ట్.. ఒక్క మాటలో డార్లింగ్‌ గురించి బన్నీ ఏం చెప్పాడంటే?

also read: సెట్‌లో బాలకృష్ణ నిజ స్వరూపం బయటపెట్టిన రోజా, వైసీపీ నాయకులకు మండడం ఖాయం

Latest Videos

click me!