ఈ రోజుల్లో ఒక బంధాన్ని చాలా తేలికగా బ్రేకప్ చెప్పుకుంటున్నారు నేటి యువత. దానికి కారణాలు అనేకం ఉన్నాయి అయినప్పటికీ ఎక్కువగా అబ్బాయిలనే పాయింట్ అవుట్ చేస్తూ ఉంటారు అమ్మాయిలు. అందులోనూ నిజం ఉందేమో. అబ్బాయిలు.. ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి.
ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలని ఏ అమ్మాయి అంత త్వరగా వదులుకోదు ఏమిటంటే ఒక అబ్బాయి పెద్దలని స్త్రీలని గౌరవించినట్లయితే అలాంటి వ్యక్తి మీద స్త్రీ అపారమైన గౌరవం ఉంటుందట.
ఇలాంటి అబ్బాయిలని ఈ అమ్మాయి అంత త్వరగా వదులుకోవటానికి ఇష్టపడదు ఎందుకంటే ఇతరులని గౌరవించడం తెలిసిన వ్యక్తి తనని కూడా గౌరవిస్తాడని బాగా చూసుకుంటాడని ఆ అమ్మాయి భావిస్తుంది. అబ్బాయిలలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటే అది అమ్మాయిలకు బాగా నచ్చుతుందట.
తన మనసులో మాట కూడా బయటికి చెప్పలేని అబ్బాయిని, సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేని అబ్బాయిలని అమ్మాయిలు అంత త్వరగా ఇష్టపడరట. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీలో లేకుండా చూసుకోండి. శరీరంపై శ్రద్ధ పెట్టి శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునే అబ్బాయిలని అమ్మాయిలు ఇష్టపడతారు.
ఎందుకంటే తన బాయ్ ఫ్రెండ్ లేకపోతే తన భర్త అందమైన వాడు చురుకైనవాడు అని పదిమందిలో చెప్పుకోవటానికి అమ్మాయిలు ఇష్టపడతారు. అలాగే అమ్మాయిలు అబ్బాయిలలో ఎక్కువగా హెల్పింగ్ నేచర్ ఉందో లేదో చూస్తారట. ఎందుకంటే బయట వాళ్లకి హెల్ప్ చేసే వ్యక్తి తనకి కచ్చితంగా చేదోడువాదోడుగా ఉంటాడు. లేనిపక్షంలో తన కర్మానికి తనని వదిలేస్తాడని అమ్మాయిలకి ఒక రకం భయం ఉంటుంది.
కాబట్టి హెల్పింగ్ నేచర్ ని కలిగి ఉండటం అబ్బాయిలకి ఎంతో అవసరం. అలాగే పరిశుభ్రత గురించి అవగాహన ఉన్న వ్యక్తిని ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. తనని తాను శుభ్రంగా ఉంచుకోలేని వ్యక్తి తన ఇంటిని, పరిసరాలని మాత్రం ఎలా శుభ్రంగా ఉంచుకుంటాడు అనేది అమ్మాయిల అభిప్రాయం. కాబట్టి అబ్బాయిలు.. ఈ లక్షణాన్ని కూడా అలవర్చుకోండి.