సెక్స్ కు ముందు దంపతులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి.. !

First Published | Sep 21, 2023, 3:41 PM IST

సెక్స్ తో దంపతులకు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే సెక్స్ లో పాల్గొనడం కంటే ముందు దంపతులు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవే వీరిని..
 

Sex Related Injuries

శృంగారం మనుషుల జీవితంలో ఒక ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇది పునరుత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇద్దరు వ్యక్తుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది. అలాగే కనెక్షన్ ను పెంచుతుంది. ఇద్దరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ దీని గురించి భాగస్వామితో కూడా మాట్లాడటానికి సిగ్గుపడేవారు చాలా మందే ఉన్నారు. కానీ దంపతులు సెక్స్ లో పాల్గొనడానికి ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేంటంటే.. 

సమ్మతి

ఏ రకమైన లైంగిక చర్యలో పాల్గొనాలనుకున్నా.. అది మీ భాగస్వామికి ఇష్టమో లేదో ఖచ్చితంగా తెలుసుకోండి. వారు మనస్ఫూర్తిగా సెక్స్ లో పాల్గొన్నప్పుడే మీరిద్దరు ఆనందాన్ని పొందుతారు. ఉత్సాహంగా ఉంటారు. మీ భాగస్వామికి నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం, వారి సరిహద్దులు, కోరికలను గౌరవించడం చాలా చాలా ముఖ్యం. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది.
 


భద్రత

లైంగిక సంక్రమణ అంటువ్యాధులు రాకుండా ఉండేందుకు, ప్లాన్స్  లేని గర్భం నుంచి మిమ్మల్ని, మీ భాగస్వామిని రక్షించడానికి సురక్షితమైన సెక్స్ లో పాల్గొనడం కూడా చాలా ముఖ్యం. ఈ సమస్యలు రావొద్దంటే కండోమ్లను, ఇతర రక్షణ పద్దతులను ఉపయోగించొచ్చు. ఇవి మిమ్మల్ని ఎన్నో లైంగిక సమస్యల నుంచి కూడా కాపాడుతాయి. 
 

Sleeping after having sex

కమ్యూనికేషన్

సెక్స్ తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. కానీ మీ మధ్య కమ్యూనికేషన్ కూడా ఉండాలి. అంటే మీకు ఏవి నచ్చుతాయి. ఏవి నచ్చవు వంటి మీ భాస్వామితో నిర్మొహమాటంగా చెప్పండి. వారితో నిజాయితీగా ఉండండి. ఇది మీ ఇద్దరి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది. 

పరిశుభ్రత

సెక్స్ సమయంలో పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. పరిశుభ్రతను పాటించకుండా సెక్స్ లో పాల్గొనడం వల్ల సంక్రమణ నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది అంటువ్యాధులను కూడా కలిగిస్తుంది. అందుకే సెక్స్ లో పాల్గొనడానికి ముందు స్నానం చేయండి. అలాగే పళ్లు తోముకోవాలి. గోర్లను చిన్నగా కట్ చేయడం వంటి పరిశుభ్రత చిట్కాలను పాటించాలి. 
 

సెక్స్ మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. గుండెను ఫిట్ గా ఉంచుతుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. దీన్ని ఆస్వాధించాలంటే మాత్రం పై చిట్కాలను పాటించాలి. సెక్స్ లో పాల్గొనడానికి తొందరపడుకుండా విశ్రాంతి తీసుకోవడానికి, లోతుగా శ్వాస తీసుకోవడానికి, మీ భావాలపై దృష్టి పెట్టడానికి కాస్త సమయం తీసుకోండి. ఇది మీకు మంచి అనుభవాన్ని కలిగిస్తుంది. 
 

రిలాక్స్ 

సెక్స్ పాల్గొనేముందు చాలా మంది టెన్షన్ గా ఉంటారు. అందుకే దీనికి ముందు భాగస్వాములిద్దరూ  రిలాక్స్ గా ఉంటానికి, సెక్స్ లో మరింత ఎక్కువ సేపు పాల్గొనడానికి  ఫోర్ ప్లే లో పాల్గొనాలి. ఫోర్ ప్లే మీలో సెక్స్ కోరికలను రేకిత్తిస్తుంది. ఇది భాగస్వాములిద్దరికీ సెక్స్ ను మరింత ఆహ్లాదకరంగా, సంతృప్తికరంగా చేస్తుంది.
 

Right time for sex

భావోద్వేగ స్థితి

మీ భావోద్వేగ స్థితి కూడా మీ లైంగిక అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో మీకు ఒత్తిడిగా, ఆత్రుతగా లేదా పరధ్యానంగా అనిపిస్తే ఈ క్షణాలను ఆస్వాధించలేరు. అందుకే లైంగిక కార్యకలాపాలలో పాల్గొనే ముందు భావోద్వేగ స్థితిని మెరుగ్గా ఉంచడానికి ప్రయత్నించండి. 

Latest Videos

click me!