ఈ విషయం తెలిస్తే పురుషులు షిలాజిత్ ను అస్సలు వదిలిపెట్టరు..!

First Published | Oct 26, 2023, 3:41 PM IST

షిలాజిత్ పురుషులకు ఎన్నో విధాలుగా మేలే చేస్తుంది. ముఖ్యంగా లైంగికం.. అవును షిలాజిత్ ను ఉపయోగించి ఎన్నో లైంగిక సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. 
 

షిలాజిత్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. లైంగిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును దీన్నిఉపయోగించి లైంగిక ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందుకు ఇది ఎంతో ప్రసిద్ధిచెందింది. షిలాజిత్ ను లైంగిక సమస్యలను తగ్గించడానికి, లిబిడోను పెంచడానికి ఎన్నో ఏండ్లుగా భారతదేశంలో ఉపయోగిస్తున్నారు. మీకు తెలుసా? షిలాజిత్ ను ఇండియన్ వయాగ్రా అని కూడా అంటారు. హిమాలయాల చుట్టూ కనిపించే షిలాజిత్ లో ఎన్నో రకాల ఖనిజాలు ఉంటాయి. ఇది హ్యూమిక్ ఆమ్లం, ఫుల్విక్ ఆమ్లం అని పిలువబడే ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. ఇది ఎన్నో లైంగిక సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. షిలాజిత్ తో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది

స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారికి షిలాజిత్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని ఎన్నో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది టెస్టోస్టెరాన్ హార్మోన్, స్పెర్మ్ ల నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. పురుషులకే కాదు మహిళలకు కూడా ఇది లైంగిక ప్రయోజనాలను కలిగిస్తుంది. షిలాజిత్ ను ఆడవారు తీసుకోవడం వల్ల వారి సంతానోత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.


Sex Life

రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది

షిలాజిత్ లో ఎన్నో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను పెంచుతాయి. నిజానికి ఇది జననేంద్రియ భాగాల చుట్టూ లేదా ఉదరం చుట్టూ రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీంతో సెక్స్ సమయంలో అంగస్తంభన లోపం, బలహీనత వంటి సమస్యలు ఉండవు.
 

Hygiene in Sex

ఒత్తిడి తగ్గడం

ఒత్తిడి, టెన్షన్స్ కారణంగా సెక్స్ లైఫ్ బాగా ప్రభావితం అవుతుంది. దీంతో సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేరు. షిలాజిత్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సెక్స్ సమయంలో యోని పొడిబారడాన్ని తగ్గిస్తుంది. అయితే దీన్ని  డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
 

ఎలా తినాలి?

నిపుణుల ప్రకారం.. రోజుకు 300 మి.గ్రా నుంచి 500 మి.గ్రా షిలాజిత్ తీసుకోవాలి. కానీ సమస్య తీవ్రత, వివిధ రకాల మందులలను వాడుతుంటే షిలాజిత్ ను జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. అందుకే నిపుణుల సలహా లేకుండా షిలాజిత్ తీసుకోకూడదు. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 
 

Latest Videos

click me!