కండరాల నొప్పి
శృంగారాన్ని వ్యాయామంతో కూడా పోలుస్తారు. దీనికి కూడా శారీరక కార్యకలాపమే అంటారు. అందుకే సెక్స్ తర్వాత మీ శరీరంలోని ఎన్నో భాగాల్లో.. ముఖ్యంగా చేతులు, పాదాలు, నడుము, తొడ మొదలైన వాటిలో నొప్పి పుడుతుంది. కొన్ని భంగిమల్లో శృంగారంలో పాల్గొంటే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇది సమస్య కానప్పటికీ.. జాగ్రత్తగా ఉండటం మంచిది.
ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి: సెక్స్ తర్వాత కండరాల ఒత్తిడి, నొప్పి రావడం చాలా సహజం. ఇలాంటి పరిస్థితిలో మీరు సెక్స్ కు ముందు కొన్ని నీళ్లను తాగండి. అలాగే సెక్స్ తర్వాత కూడా తగినంత నీటిని తాగండి. దీంతో మీ శరీరం పూర్తిగా హైడ్రేట్ గా ఉంటుంది. కండరాల ఒత్తిడి, నొప్పి కూడా తక్కువగా ఉంటాయి.