సెక్స్ సమయంలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే..!

కొబ్బరి నూనెతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కానీ ఇది మీ లైంగిక జీవితానికి కూడా మేలు చేస్తుందన్న ముచ్చట చాలా మందికి తెలియదు. నిజానికి సెక్స్ సమయంలో కొబ్బరి నూనెను ఉపయోగిస్తే ఏమౌతుందంటే? 

కొబ్బరి నూనెను దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఉపయోగిస్తారు. జుట్టు, చర్మ ఆరోగ్యానికే కాదు కొబ్బరి నూనెను వంటల్లో ఉపయోగించొచ్చు కూడాను. దీన్ని కాలిన చేతి గాయాలను మాన్పడానికి, జుట్టు పొడవుగా, ఒత్తుగా చేయడానికి కూడా ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. కానీ సెక్స్ సమయంలో లూబ్రికేషన్ కోసం కొబ్బరి నూనెను కూడా ఉపయోగించొచ్చని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. 
 


సెక్స్ సమయంలో కొబ్బరి నూనె ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది? 

వృద్ధాప్యం, మందులు లేదా హార్మోన్ల అసమతుల్యత కారణంగా మీ శరీరం తగినంత లూబ్రికేట్ ను ఉత్పత్తి చేయలేకపోతుంది. ఇలాంటి సమయంలో మీరు కొబ్బరి నూనెను లూబ్రికేట్ గా ఉపయోగించొచ్చు. ఇది సున్నితత్వం,ఉద్వేగాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. మరి సెక్స్ సమయంలో కొబ్బరినూనె వాడటం ఎంత వరకు సురక్షితమో  ఇప్పుడు తెలుసుకుందాం.
 


అమెరికా పరిశోధనా ప్రకారం.. 

యుఎస్ జాతీయ ప్రాతినిధ్య డేటా ప్రకారం.. 2015 అధ్యయనంలో.. దాదాపు 30 శాతం మంది మహిళలు సెక్స్ చేసేటప్పుడు నొప్పి వచ్చినట్టుగా నివేదించారు. ల్యూబ్ యోని పొడిని తగ్గించడమే కాకుండా సున్నితత్వం, ఉద్వేగాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుందనిఈ పరిశోధన వెళ్లడిస్తోంది.

Image: Freepik

అలాగే.. గుజరాత్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ లైఫ్ సైన్స్ రీసెర్చ్ అధ్యయనం ప్రకార.. కొబ్బరి నూనె మాయిశ్చరైజర్ గా సురక్షితమైన,  ప్రభావవంతమైన ఉపయోగం కోసం వైద్యపరంగా నిరూపించబడింది. దీని మాయిశ్చరైజింగ్ లక్షణాలు సెక్స్ సమయంలో నొప్పిని తగ్గిస్తాయి. అలాగే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనేలా చేస్తాయి. 
 

coconut oil

కొబ్బరి నూనెతో కలిగే ఇతర ప్రయోజనాలు 

రుతువిరతి తర్వాత.. 

రుతువిరతికి ముందు, తర్వాత కొబ్బరి నూనె మీకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది. ఆ సమయంలో సాధారణంగా యోని పొడిబారడం, సెక్స్ సమయంలో నొప్పి, యోని చర్మం చుట్టూ ఉన్న సన్నని కొవ్వు కణజాలంలో పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే కొబ్బరి నూనె ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. 
 

Image: Getty Images

అలెర్జీలలో.. 

మీ చర్మం అలెర్జీ లేదా సున్నితంగా ఉంటే కొబ్బరి నూనె మీ చర్మాన్ని మునుపటిలా ఆకర్షణీయంగా, మృదువుగా, తేమగా చేస్తుంది. ఇందుకోసం నేచురల్ కొబ్బరినూనెను కొనండి. ఇది మీ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Image: Getty Images

జుట్టును బలంగా.. 

కొబ్బరి నూనె మీ జుట్టుకు కూడా మంచి మేలు చేస్తుంది. ఈ నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇది మీ నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని వాడితే మీ జుట్టు అందంగా మెరవడమే కాకుండా మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా అవుతుంది. 

గుండె జబ్బులలో..

కొబ్బరినూనె కూడా గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దీనిలో ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొబ్బరినూనె గుండెకు మంచి మేలు చేస్తుంది. దీనిలో 50% లారిక్ ఆమ్లం ఉంటుంది. ఇది అధిక కొలెస్ట్రాల్ తో వచ్చే వివిధ గుండె సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది.
 

coconut oil

ఆహారాన్ని జీర్ణం చేయడంలో.. 

కొబ్బరి నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం, లారిక్ ఆమ్లం ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని లోపలి నుంచి పోషించడానికి పనిచేస్తాయి. లారిక్ ఆమ్లం మీ జీర్ణవ్యవస్థలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి, మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. అలాగే వ్యర్థ పదార్థాలు కడుపులో పేరుకుపోకుండా చేస్తుంది. అందుకే దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవాలి. 
 

బరువు తగ్గడానికి.. 

కొబ్బరి నూనె బరువు తగ్గడానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే షార్ట్ అండ్ మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అధిక బరువు తగ్గడానికి సహాయపడతాయి. ఇది చాలా సులభంగా జీర్ణమవుతుంది. అలాగే ఇది థైరాయిడ్, ఎండోక్రైన్ వ్యవస్థ ఆరోగ్యంగా పనిచేసేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి కొబ్బరినూనెను ఆహారంలో చేర్చుకోవడం వల్ల స్థూలకాయాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
 

గాయాన్ని సంక్రమణ నుంచి రక్షిస్తుంది

గాయాలను నయం చేయడంలో కొబ్బరి నూనె ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. గాయాలపై కొబ్బరి నూనెను రాసినప్పుడు కొబ్బరి నూనె ఒక రసాయన పొరను ఏర్పరుస్తుంది. ఇది సోకిన శరీర భాగాన్ని బాహ్య దుమ్ము, గాలి, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, వైరస్ల నుంచి రక్షిస్తుంది.
 

Latest Videos

click me!