సాధారణంగా ఒక బంధం లో సహనంగా ఓపికతో ఉండే భార్య ఉంటే భర్త ఎలాంటి వాడినప్పటికీ ఆ సంసారం నిలబడుతుందని పెద్దలు అంటారు. అయితే కొందరు స్త్రీలు ఉత్తమ ప్రవర్తనతో భర్తకి విసుగు తెప్పించి సంసారం మీద విరక్తి పుట్టే లాగా చేస్తారు.
అయితే ఒక భార్యగా మీరు ఈ పనులు చేస్తే మీ భర్త ని ఇబ్బందికి గురి చేసిన వారు అవుతారు.ఆ పనులు ఏంటో చూద్దాం. ఒక భార్య తన భర్త పై నిఘా పెట్టడాన్ని ఆ భర్త సహించలేడు. అలాగే భర్తను నియంత్రించడానికి ప్రయత్నించే భార్యను ఏ భర్త ప్రేమించలేడు.
అలాగే భర్త సాన్నిహిత్యాన్ని ఇష్టపడని స్త్రీని భాగస్వామ్ని గౌరవించలేని స్త్రీని, భర్త మీద అపనిందలు వేసే స్త్రీని ఒక భర్త గౌరవించలేడు. అలాగే సమసిపోయిన సమస్యని గురించి పదే పదే ప్రస్తావించటం కూడా ఒక భర్తకి ఇష్టం ఉండదు.
ఇద్దరిలో ఉండవలసిన విషయాన్ని ఒక భార్య పదిమందిలోకి తీసుకువస్తే ఆ భర్త ఆ పరిస్థితిని తట్టుకోలేడు. వేరొక స్త్రీ తో సరదాగా ఉండడానికి కూడా భరించలేని ఒక భార్యని ఒక భర్త భరించటం అనేది చాలా కష్టమైన విషయం.
భర్తని పదిమంది ముందు అవమానించి చులకన చేసే ఒక భార్య తన భర్త ఎంత ఉత్తముడైనప్పటికీ ఆ సంసారాన్ని నిలబెట్టుకోలేదు. చేసిన ప్రతి పనికి సంజాయిషీ అడగటం కూడా ఒక భర్త భరించలేడు.
అలాగే అత్తింటిని అపహాస్యం చేస్తూ పుట్టింటి వాళ్ళని నెత్తి మీద పెట్టుకోవడం కూడా ఒక భర్తని బాధించే విషయమే. ఇలాంటి ఆడవాళ్ల సంసారాలు అంత సవ్యంగా సాగవు. కాబట్టి ఒక భార్యగా మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే కచ్చితంగా మార్పు అవసరం.