శృంగారానికి ముందు వీటిని తిన్నారో.. అంతే సంగతులు..!

First Published | Jul 23, 2023, 10:01 AM IST

కొన్ని ఆహారాలు మీ సెక్స్ డ్రైవ్ ను పెంచుతాయి. కానీ శృంగారానికి ముందు కొన్ని ఆహారాలను తింటే మాత్రం సెక్స్ కు దూరంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పొరపాటున వీటిని తిన్నారో పడకగదిలో గుర్రపెట్టి నిద్రపోతారంటున్నారు నిపుణులు.
 

సెక్స్ తో ఒకటి కాదు రెండు కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ముచ్చట అందరికీ తెలిసిందే. అయితే చాలా మంది భాగస్వామితో సెక్స్ లో పాల్గొనాలని ఉత్సాహంగా ఉంటారు. అయితే కొన్ని ఆహారాలను తింటే మాత్రం సెక్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ కాస్త తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. అవును కొన్ని ఆహారాలు సెక్స్ కోరికలను పెంచితే.. ఇంకొన్నిమాత్రం సెక్స్ కోరికలను తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. మరి సెక్స్ కు ముందు ఎలాంటి ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Cheese

చీజ్

మీకు లాక్టోస్ అలెర్జీ ఉంటే చీజ్ ను అస్సలు తినకండి. మోజారెల్లా, రికోటా లేదా కాటేజ్ చీజ్ లో లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది.ఇది మీ కడుపులో సమస్యలను కలిగిస్తుంది. ఒకవేళ మీరు మీ భాగస్వామితో సెక్స్ లో పాల్గొనాలనుకుంటే మాత్రం రాత్రిళ్లు పిజ్జా, పాస్తా లేదా బర్గర్లు తినడం మానుకోండి.

Latest Videos


స్పైసీ ఫుడ్

మీ సెక్స్ జీవితాన్ని స్పైసీగా మార్చుకోవాలనుకుంటే మాత్రం సెక్స్ కు ముందు ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ను తినకండి. ఎందుకంటే స్పైసీ ఫుడ్స్ వల్ల యాసిడ్ రిఫ్లెక్స్, అజీర్థి వంటి సమస్యలు పెరుగుతాయి.దీనివల్ల మీకు సెక్స్ పై ఇంట్రెస్ట్ పోతుంది.
 

ఉల్లిపాయ, వెల్లుల్లి

ఉల్లిపాయలు, వెల్లుల్లి నోట్లు చెడు వాసన వచ్చేలా చేస్తాయి. ఇది మీకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందుకే శృంగారానికి ముందు ఉల్లిపాయ-వెల్లుల్లి వంటి మసాలా వస్తువులకు దూరంగా ఉండటం మంచిది. 
 

స్వీట్లు 

కొంతమంది స్వీట్లను రాత్రిళ్లు ఖచ్చితంగా తింటుంటారు. చక్కెరతో నిండిన కేకులు, స్వీట్లు, కుకీలు మీకు సెక్స్ పై ఉన్న ఇంట్రెస్ట్ ను తగ్గిస్తాయి. ఎందుకంటే డెజర్ట్ లో ట్రాన్స్ ఫ్యాట్, షుగర్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీకు ఉద్వేగానికి చేరుకోవడం కష్టతరం చేస్తుంది. అంతేకాదు ఎక్కువ చక్కెర మీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిని కూడా పెంచుతుంది. 
 

పిండి పదార్థాలు

జంక్ ఫుడ్ ఫుడ్ లో కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ వీటిని ఎక్కువగా తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది మిమ్మల్ని బద్ధకంగా చేస్తుంది. మీరు మీ లైంగిక జీవితాన్ని క్రిస్ప్ చేయాలనుకుంటే ఫ్రైస్, రైస్ లేదా పాస్తా వంటి కార్బ్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తినకండి. 

Soy Milk

సోయా ఉత్పత్తులు

సోయా మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. కానీ వీటిని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యంగా మారుతాయి. దీని కారణంగా మీకు లైంగిక కోరికలు తగ్గిపోతాయి. అందుకే సెక్స్ కు ముందు సోయా ఉత్పత్తులను తినకండి.
 

కార్బోనేటేడ్ పానీయాలు

కార్బోనేటేడ్ పానీయాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి  కావు.  వీటిని సెక్స్ కు ముందు అసలే తాగకూడదు. ఎందుకంటే వీటిని తాగిన తర్వాత కడుపు ఉబ్బి కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. 
 

ఆల్కహాల్

ఆల్కహాల్ ను కొద్దిమొత్తంలో తీసుకుంటే సెక్స్ లో  మరింగ చురుగ్గా ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆల్కహాల్ మీ లిబిడో, సెక్స్ డ్రైవ్ రెండింటికీ ప్రమాదకరం. ఆల్కహాల్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ అయిన మెలటోనిన్ ను పెంచుతుంది. అలాగే మీ లిబిడోను కూడా మారుస్తుంది. ఇది మిమ్మల్ని బద్ధకంగా చేస్తుంది. దీనివల్ల శృంగారంలో పాల్గొనలేరు. 
 

ఉప్పు 

సెక్స్ కు ముందు ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలకు కూడా దూరంగా ఉండండి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అంతేకాదు ఇది మీ రక్త ప్రవాహాన్ని తగ్గించి, భావప్రాప్తికి చేరకుండా చేస్తాయి.

click me!