భావప్రాప్తి లేకుండా సెక్స్ సంతృప్తిగా అనిపించదు. నిజానికి భావప్రాప్తి భాగస్వామిలిద్దరి ఆనందాన్ని పెంచుతుంది. లైంగిక సంబంధాన్ని మెరుగుపరచడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. కానీ ఉద్వేగం తలనొప్పికి కారణంకావొచ్చంటున్నారు నిపుణులు. నిపుణుల ప్రకారం.. భావప్రాప్తి ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. కొంతమందికి సెక్స్ తర్వాత ముఖ్యంగా భావప్రాప్తి సమయంలో తీవ్రమైన తలనొప్పి రావొచ్చు. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన 2013 అధ్యయనం ప్రకారం.. సెక్స్ తలనొప్పి చాలా అరుదు. సాధారణ జనాభాలో కేవలం 1 నుంచి 6 శాతం మంది మాత్రమే ప్రభావితమవుతారు.
భావప్రాప్తి తలనొప్పి అంటే ఏంటి?
భావప్రాప్తి తలనొప్పిని లైంగిక తలనొప్పి అని కూడా అంటారు. ఇది లైంగిక కార్యకలాపాల సమయంలో ముఖ్యంగా ఉద్వేగం సమయంలో వచ్చే ఒక రకమైన తలనొప్పి. ఇది తీవ్రంగా , అసౌకర్యంగా ఉంటుంది. భావప్రాప్తి తలనొప్పికి ఖచ్చితమైన కారణం పూర్తిగా అర్థం తెలీదు. కానీ ఇది లైంగిక చర్య సమయంలో తల లోపల రక్త ప్రవాహం, ఒత్తిడిలో మార్పుల వల్ల వస్తుందని నమ్ముతారు.
ప్రాధమిక ఉద్వేగం తలనొప్పి
ఈ రకమైన తలనొప్పికి అంతర్లీన కారణం లేదు. అలాగే ఇది నిరపాయమైన పరిస్థితిగా పరిగణించబడుతుందని నిపుణుడు చెబుతున్నారు. తలనొప్పి సాధారణంగా భావప్రాప్తికి ముందు లేదా ఆ సమయంలో అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మీ తలలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.
ద్వితీయ ఉద్వేగం తలనొప్పి
ఈ రకం తలనొప్పి మెదడు లేదా రక్త నాళాలలో నిర్మాణ సమస్య లేదా సెరెబ్రోస్పానియల్ ద్రవం పీడనంలో అసాధారణత వంటి అంతర్లీన అనారోగ్యం వంటి సంబంధం వల్ల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ద్వితీయ ఉద్వేగం తలనొప్పి.. దృష్టి లేదా మాట్లాడటంలో మార్పులు వంటి నాడీ లక్షణాలను కలిగిస్తుంది.
ఉద్వేగం తలనొప్పికి కారణమేంటి?
ఉద్వేగం తలనొప్పికి వయస్సు, లింగానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇవి ఎవ్వరికైనా రావొచ్చు. కానీ ఇవి మహిళల కంటే పురుషులలో ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్ చరిత్ర ఉన్నవారు భావప్రాప్తి తలనొప్పిని ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది.
ఉద్వేగం తలనొప్పికి చికిత్స
ప్రాధమిక ఉద్వేగం తలనొప్పి
ప్రాధమిక ఉద్వేగం తలనొప్పి విషయంలో.. ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారణలు ఉపశమనం కలిగిస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో తలనొప్పి ఉన్నప్పుడు సెక్స్ లో పాల్గొనడం ఆపేయడమే మంచిది. ఇది ఈ మీ తలనొప్పిని తగ్గించేందుకు సహాయపడుతుంది.
headache
ద్వితీయ ఉద్వేగం తలనొప్పి
ఉద్వేగం తలనొప్పి రావొద్దంటే ముందుగా మీ అంతర్లీన అనారోగ్య సమస్యలను తగ్గించుకోవాలి. సమస్యలను గుర్తించడానికి తగిన చికిత్సను తీసుకోవాలి. మందులు, జీవనశైలి సర్దుబాట్లను చేసుకోవాలి. కాబట్టి, హస్తప్రయోగం లేదా మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనడం వల్ల తలనొప్పి వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి.