పిల్లలు ఈ సాఫ్ట్ టాయ్స్ ని ఎక్కువగా తమ చేతుల్లోనే ఉంచుకుంటారు. ఆడుకొనేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు , బయటకు వెళ్తున్నప్పుడు కూడా వాటిని తమ వెంటే ఉంచుకుంటారు. ఆ సమయంలో బొమ్మను ఎక్కడ పడితే అక్కడ పెట్టడం వల్ల దానిపై బ్యాక్టీరియా ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వేడి, తేమతో కూడిన వాతావరణం కూడా బ్యాక్టీరియా పెరగడానికి కారణం కావచ్చు. దాని వల్ల ఆ బొమ్మలు పిల్లల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
సాఫ్ట్ టాయ్స్ ని శుభ్రం చేస్తున్నారా?
సాఫ్ట్ టాయ్స్ ని రెగ్యులర్ గా శుభ్రం చేస్తూ ఉండాలి. అలా శుభ్రం చేసిన తర్వాతే పిల్లలకు వాటిని ఇస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల.. ఆ బొమ్మలపై పేరుకుపోయిన బాక్టీరియా, వైరస్ లు తొలగిపోతాయి. క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల ఆ బొమ్మలు ఎక్కువ కాలం రంగు కోల్పోకుండా ఉంటాయి. వీటితో పాటు... పిల్లలు బొమ్మలతో ఆడుకునే ప్రదేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి.
సాఫ్ట్ టాయ్స్ ని శుభ్రం చేసే విధానం...
బొమ్మను దిండు కవర్ లేదా లాండ్రీ బ్యాగ్‌లో ఉంచి, చల్లటి నీటితో , తేలికపాటి డిటర్జెంట్‌తో వాషింగ్ మెషిన్ లో ఉతకవచ్చు. లేదంటే.. గోరువెచ్చని నీటిలో కొద్దిగా సబ్బు కలిపి.. ఆ నీటిలో ఈ సాఫ్ట్ టాయ్స్ ని ఉంచాలి. కాసేపటి తర్వాత నీడలో వీటిని ఆరపెడితే సరిపోతుంది.