Moral Story: కొడితేనే పిల్లలు మాట వింటారు అనుకునే పేరెంట్స్ కచ్చితంగా ఈ గాడిద కథ చదవాలి. పిల్లలను కొట్టడం కాకుండా, అర్థం చేసుకోవడం నిజమైన శిక్షణ అని నేర్పించే కథ ఇది…
ఈ కాలం పిల్లలు చాలా మొండిగా వింటున్నారు. పేరెంట్స్ చెప్పేది అస్సలు వినడం లేదు. దీంతో.. మాట వినడం లేదనే కోపంతో పేరెంట్స్ పిల్లలను కొడుతూ ఉంటారు. కొట్టకపోతే... పిల్లలు మారరు అనే భావన కూడా పెరిగిపోతోంది. మీరు కూడా.. ఏదో ఒక విషయం మీద ముఖ్యంగా అల్లరి చేస్తున్నారని, మాట వినడం లేదు అని కొడుతున్నట్లయితే... కచ్చితంగా ఈ గాడిద కథ చదవాల్సిందే.
24
గాడిద కథ..
ఒక చిన్న గ్రామంలో బట్టలు ఉతికే ఒక మనిషి ఉండేవాడు. అతనికి ఒక గాడిద ఉండేది. ఆ గాడిద ప్రతిరోజూ తన యజమానికి ఉతకాల్సిన బట్టల మూటలను నది వరకు మోసేది. తర్వాత మళ్లీ ఇంటికి కూడా మోసుకొచ్చేది. ఆ గాడిద ఎంతో కష్టపడి పని చేసినా కూడా.. కొన్ని సార్లు చాలా నిదానంగా నడిచేది. అది అలా నెమ్మదిగా నడవడం యజమానికి నచ్చేది కాదు. దీంతో... కోపంతో ఆ గాడిదను కర్రతో కొట్టేవాడు.
అలా కొట్టే సమయంలో కూడా గట్టి గట్టిగా గాడిద మీద అరిచేసేవాడు. ఆలస్యంగా నడుస్తుంటే.. తనకు పనికి లేటు అవుతుందని ఆ యజమానికి కోపం వచ్చేది. కానీ.. రోజూ యజమానికి కొట్టడం వల్ల ఆ గాడిదకు చాలా బాధగా, నొప్పిగా ఉండేది. ఈ దెబ్బలు తినలేక ఒక రోజు ఆ గాడిద భయంతో అడవిలోకి పారిపోయింది.
34
ప్రేమతోనే మార్పు..
గాడిద కనిపించకపోవడంతో యజమానికి కూడా చాలా భయం వేసింది. వెంటనే దాని గురించి వెతకడం మొదలుపెట్టాడు. చాలా సేపటి తర్వాత అతనికి తన గాడిద దొరికింది. చాలా సంతోషించాడు. తాను కొట్టడం వల్లే ఇలా జరిగిందని ఆ యజమాని కూడా ఫీలౌపోయాడు. ఇంకోసారి ఇలా చేయకూడదు అని ఫిక్స్ అయ్యాడు. తన గాడిదకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాడు. అప్పటి నుంచి మళ్లీ ఆ గాడిదను ఎప్పుడూ కొట్టలేదు. దీంతో.. ఆ గాడిద కూడా యజమాని చెప్పినట్లు చేయడం మొదలుపెట్టింది. నమ్మకంగా, సంతోషంగా పని చేసింది.
కథలో నీతి... భయంతో కాదు, ప్రేమతోనే మార్పు సాధ్యం అవుతుంది. “ప్రేమతో చెప్పిన మాట ఎప్పుడూ కర్రతో కొట్టిన దెబ్బకంటే ఎక్కువ శక్తివంతం.”
పేరెంట్స్ కూడా.. మాట వినడం లేదని పిల్లలను కొట్టడం, కోపం చూపించకూడదు. మీరు ఇలా చేయడం వల్ల అప్పటికప్పుడు పిల్లలు మాట విన్నట్లే కనిపిస్తారు. కానీ... ఇదే రెగ్యులర్ గా రిపీట్ అయితే... పిల్లల్లో భయం, అసహనం, దూరం పెరుగుతాయి. పిల్లలు మాట వినాలంటే మనం వారి మనసు గెలుచుకోవాలి. భయపెట్టకూడదు. ఎందుకంటే, పిల్లల మనసు చాలా మృదువైనది. వారిని కొడితే వారు తప్పు చేశాననే భావన కంటే.. ‘నన్ను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు’ అనే భావన ఎక్కువగా మిగులుతుంది. వీలైనంత వరకు మనం వారితో నెమ్మదిగా మాట్లాడి, ఎందుకు ఆ పని చేయకూడదో వివరించి చెబితే వారు కచ్చితంగా అర్థం చేసుకుంటారు. ప్రేమతో చెప్పిన మాట పిల్లల మనసులో గాఢంగా నిలుస్తుంది.