Cough Syrup: చిన్న పిల్లలకు దగ్గు మందు ఎందుకు వాడకూడదు? వాడితే ఏమవుతుంది?

Published : Oct 14, 2025, 06:29 PM IST

సాధారణంగా చిన్నపిల్లలకు దగ్గు వచ్చినప్పుడు పేరెంట్స్ వారికి మందులేస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. అస్సలు పిల్లలకు దగ్గు మందు వేయొచ్చా? లేదా? వేస్తే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ చూద్దాం.

PREV
15
దగ్గు మందు దుష్ప్రభావాలు

సాధారణంగా చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు దగ్గు రాగానే.. డాక్టర్ సలహా లేకుండా మందులు వేస్తుంటారు. కానీ అది ఎంతమాత్రం మంచిదికాదు. దగ్గు మందుల వాడకంపై కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఎంత ముఖ్యమో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలే నిదర్శనం. చిన్నారులకు దగ్గు మందులు ఎందుకు వాడకూడదో.. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

25
దగ్గు జబ్బు కాదు

నిజానికి దగ్గు ప్రత్యేకమైన జబ్బు కాదు. ఇది మన శరీరంలోని రక్షణ వ్యవస్థకు చెందిన సహజ స్పందన. మన శ్వాసనాళాల్లోకి దుమ్ము లేదా ఇతర హానికర పదార్థాలు ప్రవేశించకుండా అడ్డుకోవడానికే శరీరం దగ్గు రూపంలో స్పందిస్తుంది. అంతేకాదు టిబీ, ఆస్తమా, నిమోనియా వంటి వ్యాధుల్లోనూ దగ్గు ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో కేవలం దగ్గును తగ్గించడమే కాకుండా, దాని వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించి వైద్యం చేయాల్సి ఉంటుంది. అయితే దానిపై అవగాహన లేకుండా చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు దగ్గు మందులు వేస్తుంటారు. దానివల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. 

35
దగ్గు మందు వేస్తే వచ్చే సమస్యలు

పిల్లల శరీర నిర్మాణం, ముఖ్యంగా వారి మెటబాలిజం వ్యవస్థ పెద్దవారితో పోల్చితే చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే పెద్దవారికి వాడే మందులు లేదా డోసును పిల్లలకు వేస్తే, ఆ మందు వారిపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశముంది. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు వారు వేసుకునే దగ్గు మందునే పిల్లలకు వాడుతుంటారు. అది ఎంతమాత్రం మంచిదికాదు. దానివల్ల పిల్లలు మత్తుగా ఉండటం, ఎక్కువగా నిద్రపోవడం లాంటివి జరుగుతాయి. కొన్నిసార్లు హార్ట్ బీట్ పెరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అరుదుగా ఫిట్స్ రావడం, లేదా లివర్ సంబంధిత సమస్యలు వస్తాయి. 

45
వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి

సాధారణంగా చిన్నారుల్లో వచ్చే దగ్గు చాలాసార్లు వైరల్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది. అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వాటంతట అవే తగ్గిపోతాయి. దగ్గు మందులు వాడితే నాలుగు రోజుల్లో తగ్గిపోతే.. వాడకపోతే 6-7 రోజుల్లో తగ్గుతుందట. అంటే మందు వాడకం తప్పనిసరి కాదు. కొన్ని దగ్గు మందులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. అసలు వ్యాధిని నయం చేయవు. పిల్లల్లో వారం తర్వాత కూడా దగ్గు తగ్గకపోతే డాక్టర్ సలహా తీసుకొని వారు సూచించిన మందులు వేసుకోవడం మంచిది. 

55
దగ్గు మందులో రకాలు

దగ్గు మందుల్లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని మందులు కఫాన్ని బయటకు పంపేలా చేస్తే.. మరికొన్ని లోపలే ఉండేలా చేస్తాయి. పిల్లల దగ్గు లక్షణాన్ని బట్టి సరైన మందు ఎంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఐదు ఏళ్లలోపు పిల్లలందరికీ దగ్గు చాలావరకు దానికదే తగ్గే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో నిపుణుల సలహా లేకుండా మందులు వాడడం వల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుంది.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. చిన్నపిల్లలకు అనవసరమైన మందుల వాడకాన్ని నియంత్రించడం ద్వారా వారి భవిష్యత్తును రక్షించవచ్చు. పిల్లల ఆరోగ్యం విషయంలో అవగాహన లేకుండా, సొంతంగా తీసుకునే నిర్ణయాలు ప్రమాదకర పరిణామాలకు దారి తీయవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories