Child Health Tips: చిన్న పిల్లలకు సిరప్ వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!

Published : Oct 12, 2025, 05:34 PM IST

చిన్న పిల్లలకు మందులిచ్చే విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న తప్పు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. కాబట్టి పిల్లలకు సిరప్ వేసేటప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం. 

PREV
16
Child Health Tips:

చిన్న పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటివి వచ్చినప్పుడు తల్లిదండ్రులు సిరప్ లు వేస్తుంటారు. ఇలా పిల్లలకు ఒంట్లో బాగోలేనప్పుడు మందులు వేయడం సహజమే. కానీ ఆ సమయంలో తల్లిదండ్రులు అవగాహన లేకుండా చేసే కొన్ని తప్పుల వల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. మరి పిల్లలకు మందులు వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
వైద్యుల సూచన లేకుండా సిరప్ వేయొద్దు:

చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు ఇంట్లో ఉన్న పాత సిరప్ లు లేదా అంతకుముందు వాడిన మందులు తిరిగి కొనుగోలు చేసి వాడుతుంటారు. కానీ అది మంచిదికాదు. జలుబు, దగ్గు, ఇతర వ్యాధులు ఒక్కోసారి ఒక్కోరకమైన వైరస్ ల వల్ల రావచ్చు. అందుకు తగిన మెడిసిన్ ఇచ్చినప్పుడే అవి తగ్గుతాయి. కాబట్టి వైద్యుల సలహా తీసుకొని మందులు ఇవ్వడం మంచిది.

36
సరైన మోతాదు:

చిన్నారులకు ఇచ్చే మందు మోతాదు వారి వయసు, బరువుపై ఆధారపడి ఉంటుంది. కానీ చాలామంది తల్లిదండ్రులు.. కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు అనే అభిప్రాయంతో ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. అంతేకాదు సిరప్‌ వేసేటప్పుడు స్పూన్ లాంటివి వాడకూడదు. సిరప్ తో వచ్చే మెజర్మెంట్ కప్పు లేదా డ్రాపర్‌ను ఉపయోగించడం మంచిది. మోతాదుకు మించి మందు ఇవ్వడం వల్ల లివర్ లేదా కిడ్నీల మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. కొన్నిసార్లు జ్ఞాపకశక్తి, శ్వాస సమస్యలు కూడా రావచ్చు. 

46
సిరప్‌ను ఇతర ద్రవాల్లో కలిపి ఇవ్వకూడదు:

చాలామంది తల్లిదండ్రులు.. పిల్లలు సరిగ్గా సిరప్ తాగకపోతే దాన్ని పాలు, జ్యూస్, నీటిలో కలిపి ఇస్తారు. అయితే కొన్ని మందులు ఇతర ద్రవాల్లో కలిసినప్పుడు వాటి ప్రభావం తగ్గిపోవచ్చు లేదా అసహజంగా మారిపోవచ్చు. కాబట్టి సిరప్‌ను డాక్టర్ సలహా ప్రకారం డైరెక్ట్‌గా వేయడమే ఉత్తమం.

టైంకి ఇవ్వకపోవడం లేదా ఎక్కువసార్లు ఇవ్వడం: 

సిరప్ ని డాక్టర్ సూచించిన టైం ప్రకారం వేయడం ముఖ్యం. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. ఇలా చెప్పిన సమయానికి కాకుండా మన ఇష్టం వచ్చినట్లు ఇస్తే మందు ఎఫెక్టివ్‌గా పని చేయదు. అలాగే పిల్లలకు రాత్రిపూట దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తున్నాయని.. ఎక్కువసార్లు మందు వేయకూడదు. దానివల్ల ఆరోగ్యానికి హాని కలగవచ్చు. 

56
ఎక్స్‌పైరీ తేదీ:

ప్రస్తుతం చాలామంది పేరెంట్స్ ఇంట్లో ఉన్న పాత సిరప్‌లను ఇష్టానుసారం వాడుతున్నారు. సిరప్‌లకు ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది. ఆ తేదీని కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆ తేదీ దాటి వాడితే ఆరోగ్యానికి మేలు జరగకపోగా హాని జరిగే ప్రమాదం ఉంది. అంతేకాదు ఒక సిరప్ ని ఒకసారి ఓపెన్ చేస్తే దాని స్వభావాన్ని బట్టి వారం నుంచి నెల రోజుల్లోపే వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. 

66
సిరప్ లను నిల్వ చేసే విషయంలో :

సిరప్ లను స్టోర్ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల మందులను రూమ్ టెంపరేచర్‌లో.. మరికొన్ని రకాల మందులను ఫ్రిడ్జ్ లో పెట్టాల్సి ఉంటుంది. చల్లటి ప్రదేశంలో నిల్వచేయాల్సిన మందును బయట స్టోర్ చేస్తే.. మందు తన గుణాన్ని కోల్పోయి పని చేయకపోవచ్చు. అంతేకాదు సిరప్ బాటిళ్లను పిల్లలకు అందుబాటులో ఉంచితే వారు పొరపాటున ఎక్కువగా తాగే ప్రమాదం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories