Story Books: కథలను ఇష్టపడని పిల్లలు ఉండరు. స్కూల్లో పాఠ్య పుస్తకాలు చదవడానికి ఇష్టపడని పిల్లలు కూడా కథల పుస్తకాలను ఇష్టపడతారు. అందుకే.. మీరు వారికి ప్రముఖ రచయిత సుధామూర్తి రాసిన ఈ పుస్తకాలను కచ్చితంగా పరిచయం చేయాలి.
పిల్లల భవిష్యత్తు బాగుండాలని, వారికి మంచి విలువలు నేర్పించాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కానీ, ఈ డిజిటల్ యుగంలో పిల్లలు టీవీ, ఫోన్ లతోనే కాలం గడుపుతున్నారు. పిల్లలతో ఈ ఫోన్లు, టీవీలు మాన్పించడం, మంచి అలవాట్లు నేర్పించడం ఈ కాలం పేరెంట్స్ కి చాలా కష్టం అయిపోయిందని చెప్పొచ్చు. అయితే.. ఎంత కష్టం అయినా.. మీరు కనుక మీ పిల్లలతో కొన్ని పుస్తకాలు చదివిస్తే వాళ్లలో కచ్చితంగా మార్పు రావడం తథ్యం.
26
సుధామూర్తి పుస్తకాలు..
సుధామూర్తి పుస్తకాలకు చాలా తొందరగా పిల్లలకు కనెక్ట్ అయిపోతారు. ఆమె కథల్లో ఉండే సౌమ్యత, సరళత, సత్యం, స్నేహం, సహాయం వంటి విలువలు పిల్లల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి. పిల్లలు చదవడానికి కూడా చాలా సులభంగా ఉంటాయి. అలాంటి పుస్తకాలు ఏంటో ఓసారి చూద్దాం....
36
1.Grandma's Bag of Stories
పిల్లల చేత పేరెంట్స్ చదివించాల్సిన మొదటి పుస్తకాలలో ఈ Grandma's Bag of Stories ముందు వరసలో ఉంటుంది. ఈ పుస్తకంలో చాలా కథలు ఉంటాయి. ఒక్కో కథకు ఒక్కో నీతి ఉంటుంది. మానవీయ కోణంలో ఉండే ఈ కథలను చదవడం వల్ల పిల్లల్లో ధైర్యం, నిజాయితీ పెరుగుతుంది. కథలు చదవడం రాకపోతే పిల్లలకు చదివి వినిపించండి. దీని వల్ల కిడ్స్ లో క్రియేటివిటీ పెరుగుతుంది.
How I Taught My Grand Mother to Read and Other Stories
ఈ పుస్తకంలో సుధామూర్తి తన సొంత జీవిత అనుభవాలతో కూడిన కథలను వివరించారు. ఈ పుస్తకంలో సుధా మూర్తి తన అమ్మమ్మ గారికి చదవడం, రాయడం ఎలా నేర్పించారో వివరించారు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన సవాళ్లను, ప్రేమ, క్రమశిక్షణ అన్నింటి గురించి చాలా బాగా తెలియజేశారు. అంతేకాదు.. చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు అనే విషయం దీని ద్వారా తెలుసుకోవచ్చు.
56
The Magic of the Lost Temple
ఈ పుస్తకం కూడా పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. నూనీ అనే అమ్మాయి తన తాత, తాతమ్మల గ్రామానికి వెళ్తుంది. అక్కడ నూనీ తన స్నేహితులతో కలిసి ఓ గుడి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అడ్వెంచర్ ఫీలింగ్ ఇచ్చే కథ పిల్లలకు చాలా బాగా ఆకట్టుకుంటుంది.
66
4. The Magic Drum and Other Favourite Stories
ఈ పుస్తకంలో అనేక ప్రజాదరణ పొందిన కథలు ఉంటాయి. దాదాపు అన్నీ మ్యాజిక్ కి సంబంధించినవి ఉంటాయి. ఒక కథకు, మరో కథకు అస్సలు సంబంధం ఉండదు. కానీ.. అన్ని కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
5. Unusual Tales from Indian Mythology
ఇది భారతీయ పురాణాల నుండి సాధారణ కథలకంటే విభిన్నంగా ఉంటుంది. రాముడు, కృష్ణుడు జీవితానికి సంబంధించిన కథలను చాలా భిన్నంగా ఈ పుస్తకంలో చూపించారు. ఈ పుస్తకం చదవడం వల్ల పిల్లల్లో పురాణాల పై ఆసక్తి పెరుగుతుంది.