Parenting Tips: జీవితంలో తాము పొందలేనివన్నీ... పిల్లలకు అందించాలని అనుకుంటూ ఉంటారు. అయితే... మీకు మీ పిల్లలపై ఎంత ప్రేమ ఉన్నా... మీరు చేసే కొన్ని పొరపాట్లు మాత్రం... మీ పిల్లలను చాలా మొండిగా తయారు చేస్తాయి. పిల్లుల మీ మాట వినకుండా తయారౌతారు.
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కోరుకుంటారు. అందుకోసం పేరెంట్స్ చాలా కష్టపడతారు. పిల్లల కోసం రూపాయి రూపాయి పోగేసి మరీ..వారికి కావాల్సినవి కొని పెడుతూ ఉంటారు. జీవితంలో తాము పొందలేనివన్నీ... పిల్లలకు అందించాలని అనుకుంటూ ఉంటారు. అయితే... మీకు మీ పిల్లలపై ఎంత ప్రేమ ఉన్నా... మీరు చేసే కొన్ని పొరపాట్లు మాత్రం... మీ పిల్లలను చాలా మొండిగా తయారు చేస్తాయి. పిల్లుల మీ మాట వినకుండా తయారౌతారు. మరి, పేరెంట్స్ చేయకూడని తప్పులు ఏంటో చూద్దాం....
24
తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు...
ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా... పేరెంట్స్ ఒకటే మాట చెబుతూ ఉంటారు. మా పిల్లలు మా మాట వినడం లేదు అని.. ఇది ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. మీ పిల్లలు కూడా మీరు ఏది చెప్పినా వినిపించుకోకుండా... మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే... మీరు వారితో మాట్లాడే తీరు కచ్చితంగా మార్చుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు.
34
గట్టిగా అరవడం....
పేరెంట్స్ గట్టిగా అరిస్తే... పిల్లలు మాట వింటారు అని అనుకుంటూ ఉంటారు. మొదట్లో పిల్లలు మాట విన్నట్లే కనిపిస్తారు. కానీ తర్వాత వారిది మొండి ప్రవర్తనగా మారే ప్రమాదం ఉంది. పిల్లలు నిశ్శబ్దంగా మారిపోతారు. పేరెంట్స్ ఏం చెప్పినా వినకుండా, పట్టించుకోకుండా ఉండటం మొదలుపెడతారు. తర్వాతర్వాత నెమ్మదిగా స్పందించడమే మానేస్తారు.
పిల్లల మాట వినకపోవడం...
పేరెంట్స్ తమ పిల్లలను పట్టించుకోనప్పుడు... పిల్లల్లో మొండితనం పెరుగుతుంది. నెమ్మదిగా... పిల్లలు కూడా పేరెంట్స్ మాట వినకపోవడం, పట్టించుకోకపోవడం లాంటివి చేస్తారు. అలా జరగకుండా ఉండాలి అంటే... వారితో మాట్లాడుతూ ఉండండి. వారికి చిన్న చిన్న కథలు చెబుతూ ఉండండి. ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేయించండి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఇక.. పిల్లలు చెప్పే విషయాలను కూడా మీరు ఓపికగా వినడం అలవాటు చేసుకోవాలి.
పిల్లలు ఎక్కువ సేపు ఏ విషయం మీదా శ్రద్ధ చూపించలేరు. వారికి ఏదైనా విషయాన్ని వివరించే ముందు... పేరాగ్రాఫ్ రూపంలో కాకుండా.. చిన్న చిన్న వ్యాఖ్యాల రూపంలో వారికి సూచనలు ఇవ్వాలి. అప్పుడు వారు పేరెంట్స్ చెప్పేది అర్థం చేసుకునే అవకాశం ఉంది.
పరధ్యానంలో ఉన్నప్పుడు సూచనలు ఇవ్వడం
పిల్లలు పరధ్యానంలో ఉన్నప్పుడు సూచనలు ఇవ్వకూడదు. టీవీలు, ఫోన్ లు స్క్రోల్ చేస్తున్నప్పుడు మీరు వారికి ఏమైనా చెబితే.... అది వారి చెవికి చేరదు. అప్పుడు కూడా పిల్లలు మాట వినరు. కాబట్టి... మనం పిల్లలకు ఏదైనా విషయం చెప్పాలని అనుకున్నప్పుడు.. దూరం నుంచి కాకుండా.. దగ్గర నుంచి వారికి సూచనలు ఇవ్వాలి. వారికి చెప్పే విషయం కూడా చాలా నెమ్మదిగా, వివరిస్తూ.. అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడు..