Parenting Tips: కొంతమంది పిల్లలు ఎంతో చదువుతుంటారు. కానీ పరీక్షల్లో మాత్రం పాస్ మార్కులు మాత్రమే వస్తుంటాయి. అయితే తల్లిదండ్రులు కొన్ని పనులు చేస్తే మీ పిల్లలు పరీక్షల్లో టాప్ మార్కులను తెచ్చుకుంటారు.
చాలా మంది పిల్లలు ఎంతో కష్టపడి చదువుతుంటారు. కానీ పిల్లలు కష్టంతో కాకుండా తెలివిగా చదితే మంచిదంటారు నిపుణులు. దీనివల్లే పిల్లలకు పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. చాలా మంది పేరెంట్స్ పిల్లలు బాగా చదవాలని, క్లాస్ ఫస్ట్ రావాలని ఎప్పుడూ చదివిస్తుంటారు. కానీ ఇలా చదవడం వల్ల పిల్లలకు పాస్ మార్కులు తప్ప క్లాస్ ఫస్ట్ మార్కులు రావు. మరి పిల్లలకు టాప్ మార్కులు రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
25
పిల్లలకు టాప్ మార్కులు రావాలంటే?
పిల్లలకు చదవుతో పాటుగా గేమ్స్ కూడా ఉండాలి. అలాగే ఎప్పుడూ గేమ్స్ ఆడించకూడదు. ఈ రెండింటికి ఒక టైం టేబుల్ ను రెడీ చేయాలి. పిల్లల్ని ఎఫ్పుడూ చదివిస్తే వారికి చదవాలన్న ఇంట్రెస్ట్ పోతుందది. అందుకే చదువు మధ్యలో గేమ్స్, ఇతర పనులకు కూడా సమయాన్ని కేటాయించాలి. అప్పుడే పిల్లలకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది.
35
టెక్నిక్ వాడండి
పిల్లలకు చదువుపై ఇంట్రెస్ట్ రావాలంటే కొద్దిసేపు చదివి మరికొద్దిసేపు బ్రేక్ తీసుకోమని చెప్పాలి. అంటే 25 నిమిషాలు చదివితే 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఈ టెక్నిక్ వల్ల పిల్లలకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. చదువంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
మొత్తం చదవడమే కాదు.. చదివిన దాన్ని చిన్న నోట్స్ రాసుకోమని మీ పిల్లలకు చెప్పండి. చదివిన దాన్ని అర్థం చేసుకోవడం పిల్లలకు నేర్పండి. రాని, ముఖ్యమైన పదాలను నోట్స్ రాయమనండి.
55
ఎప్పుడూ గదిలో వద్దు
పిల్లల్ని ఎప్పుడూ గదిలోనే చదివించే తప్పు చేయకండి. అప్పుడప్పుడు బయట ప్రదేశాలకు వెళ్లి చదివించండి. అలాగే పార్కులు, మ్యూజియాలకు మీ పిల్లలన్ని తీసుకెళ్లండి. పిల్లలకు ప్రత్యక్ష అనుభవం వల్ల వారి చదువు మెరుగుపడుతుంది.ముఖ్యంగా వారు చదివేటప్పుడు వారితో పాటు మీరు కూడా చదవండి. వారికి చదువుపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.