Parenting Tips : చాలా మంది పిల్లలు మట్టిని చూడగానే నోట్లో పెట్టుకుని తింటుంటారు. కొట్టినా మట్టిని తినే అలవాటును మాత్రం మానుకోరు. అసలు పిల్లలు మట్టిని తినడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
ఏడాది వయసున్న పిల్లల నుంచి రెండేండ్ల వయసున్న పిల్లలు మట్టిని చూస్తే నోట్లో పెట్టుకోకుండా ఉండలేరు. కొంతమంది పిల్లలు ఈ అలవాటును మానుకున్నా కొందరు పిల్లలు మాత్రం ఈ అలవాటును కొన్నేండ్ల వరకు కొనసాగిస్తారు. ఇలాంటి పిల్లలు బెదిరించినా, బుజ్జగించి చెప్పినా, కొట్టినా మట్టిని తినకుండా అస్సలు ఉండలేరు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మట్టిని తినే అలవాటును మాన్పే చిట్కాలు కూడా ఉన్నాయి.
24
ఐరన్ లోపం
పిల్లలు మట్టిని తినడానికి అసలు కారణం వారిలో ఐరన్ లోపించడమే అంటున్నారు నిపుణులు. ఈ ఐరన్ లోపాన్ని భర్తీ చేయడానికి మట్టిని తినాలనిపిస్తుందట. ఐరన్ తో పాటుగా శరీరంలో కాల్షియం, జింక్ లు లోపించడం వల్ల కూడా పిల్లలు మట్టిని తినడానికి అలవాటు పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లోపాలను గనుక సరిచేస్తే పిల్లలు మట్టిని తినడం మానేస్తారు.
34
ఒత్తిడి, ఆందోళన
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొంతమంది పిల్లలు మట్టిని తినడానికి ఒత్తిడి, ఆందోళన, విసుగు కూడా కారణం కావొచ్చు. పిల్లలు విసుగు చెందినా, ఒత్తిడికి గురైనా మట్టిని తిని ఉపశమనం పొందుతారు. ఇది వారికి ఒక రకమైన ఉపశమనాన్ని ఇస్తుందట. అలాగే తల్లిదండ్రుల దృష్టిని ఆకర్షించడానికి కూడా పిల్లలు ఇలా చేస్తారు. దీన్ని గుర్తిస్తే మీరు పిల్లలు మట్టిని తినకుండా చేయొచ్చు.
మీ పిల్లలు మట్టిని తింటున్నట్టు గుర్తిస్తే గనుక వెంటనే హాస్పటల్ కు తీసుకెళ్లడం మంచిది. దీనివల్ల మీ పిల్లలకు బ్లడ్ టెస్ట్ చేసి వారిలో ఐరన్ లోపం ఉందో? జింక్ లోపం ఉందో తెలుస్తుంది. దీనివల్ల మట్టిని తినే అలవాటును తొందరగా మాన్పించొచ్చు.