ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. వారి మధ్య తగాదాలు జరగడం సర్వ సాధారణం. కానీ, ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, ఆ గొడవలను కాసేపు పక్కన పెట్టడం చాలా అవసరం. ఆ సమయంలో ఎంత కోపం వచ్చినా నియంత్రించుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పిల్లల ముందు తల్లిదండ్రులు వాదించుకోకూడదు. ఎందుకంటే, పేరెంట్స్ మాట్లాడే మాటలు, వారి ప్రవర్తన మొత్తం పిల్లల మనస్తత్వాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. పేరెంట్స్ రెగ్యులర్ గా పిల్లల ముందు ఎందుకు గొడవ పడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం...
25
భావోద్వేగ ఒత్తిడిని సృష్టిస్తుంది
పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. పేరెంట్స్ ఇద్దరూ ప్రతిసారీ వాదించుకోవడం, గొడవ పడటం లాంటివి చేసినప్పుడు.. వారి మనసు గాయపడుతుంది. పిల్లలు అలాంటి వాతావరణంలో ఉన్నప్పుడు ఎక్కువగా భయపడతారు. ఆందోళన, విచారం, అభద్రతా భావం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తల్లిదండ్రుల మీద కోపం...
పిల్లలు తమ తల్లిదండ్రులు గొడవ పడటం పదే పదే చూసినప్పుడు, వారు పేరెంట్స్ లో ఎవరో ఒకరిపై లేదా ఇద్దరిపై కోపం పెంచుకోవచ్చు. ఇది వారి భావోద్వేగ అనుబంధాన్ని బలహీనపరుస్తుంది. కుటుంబంలో దూరాన్ని సృష్టిస్తుంది.
35
మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలు
నిరంతర సంఘర్షణ , వాదనల వాతావరణంలో పెరిగే పిల్లలు నిరాశ, ఆందోళన లేదా ప్రవర్తనా సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది . అలాంటి పిల్లలు ఆత్మవిశ్వాసం లేకపోవడంతో కూడా బాధపడవచ్చు.
తప్పుడు ప్రవర్తనను అనుకరించడం
పిల్లలు తాము చూసేదాన్ని నేర్చుకుంటారు. అరవడం లేదా వాదించడం ద్వారా సమస్యలు పరిష్కరించగలం అని నమ్ముతారు. వారు, అదే ప్రవర్తనను అలవరుచుకుంటారు. జీవితంలో వారు కూడా అదే ఫాలో అవుతారు. ఇది వారి భవిష్యత్ సంబంధాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.
చాలా సార్లు పిల్లలు తమ తల్లిదండ్రుల మధ్య తగాదాలకు తమను తాము నిందించుకోవడం ప్రారంభిస్తారు. తమ వల్లే ప్రతిదీ తప్పు జరుగుతోందని వారు భావిస్తారు. ఇది వారి ఆత్మగౌరవాన్ని ప్రభావితం చేస్తుంది. వారు అపరాధ భావనతో జీవించడం ప్రారంభిస్తారు.
అభద్రతా భావాలు పెరుగుతాయి..
తరచూ తల్లిదండ్రులు గొడవలు పడుతూ ఉంటే.. తమ పేరెంట్స్ ఎప్పటికైనా విడిపోతారు అనే భావన పిల్లల్లో కలుగుతుంది. తమ పిల్లలు విడిపోతారని తరచూ విడిపోతారని భయపడుతూ ఉంటే.. ఇది వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.
55
విభేదాలను ఎలా పరిష్కరించాలో నేర్చుకోరు
పిల్లలు తమ తల్లిదండ్రులు ప్రశాంతంగా సమస్యను పరిష్కరించుకోవడం ఎప్పుడూ చూడకపోతే, వారు అలాంటి నైపుణ్యాలను స్వయంగా అభివృద్ధి చేసుకోలేరు. తేడాలను సానుకూల రీతిలో ఎలా పరిష్కరించాలో వారికి తెలియదు. అంతేకాదు.. తమ పేరెంట్స్ తమను పట్టించుకోవడం లేదని, తాము ఒంటరిగా ఉన్నామనే భావన బాగా పెంచుకుంటారు.