Parenting: పిల్లలు ఏడుపు ఆపడం లేదా? ఈ ఫన్నీ గేమ్స్ తో వాళ్ల మనసు ఇట్టే మార్చేయొచ్చు

Published : Nov 09, 2026, 11:00 AM IST

Parenting: పిల్లలు ఒక్కోసారి చిన్న విషయాలకే గట్టిగా ఏడుస్తుంటారు. ఎంత నచ్చజెప్పినా, బుజ్జగించినా ఏడుపు ఆపరు. దీంతో తల్లిదండ్రులు ఏం చేయాలో తెలియక అరిచేస్తారు. అలాంటప్పుడు కోప్పడకుండా ఈ ఫన్నీ యాక్టివిటీలతో పిల్లల మూడ్ ఇట్టే మార్చేయొచ్చు.

PREV
15
పిల్లలు ఏడుపు ఆపడం లేదా?

పిల్లలు ఒక్కోసారి చిన్న విషయాలకే గట్టిగా ఏడ్చేస్తారు. ఎంత చెప్పినా, బుజ్జగించినా ఏడుపు ఆపరు. దీంతో తల్లిదండ్రులకు ఆ టైంలో ఏం చేయాలో తెలియక అరిచేస్తుంటారు. అయితే పిల్లలు ఇలా ప్రవర్తించడం ఎప్పుడూ అల్లరి లేదా మొండితనం వల్లే కాదు. వారి మెదడు ఎదుగుదల, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఇంకా పూర్తిస్థాయిలో డెవలప్ కాకపోవడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అలాంటప్పుడు కొన్ని సరదా యాక్టివిటీలతో పిల్లలు భావోద్వేగాలను మార్చేయొచ్చు.

25
చెప్పినా ఎందుకు వినరు?

పిల్లలు ఏడ్చినప్పుడు, అలిగినప్పుడు పెద్దలు చెప్పే మాటలను వెంటనే అర్థం చేసుకుని పాటించడం కష్టమవుతుంది. ముఖ్యంగా 'ఏడవకు', కామ్ గా ఉండు' అని చెప్పినా వినరు. ఎందుకంటే ఆ సమయంలో తమ భావాలను ఎలా నియంత్రించుకోవాలో వారికి తెలియకపోవచ్చు. పైగా, అలా చెప్పడం వల్ల తమ భావాలను పెద్దలు పట్టించుకోవడం లేదనే ఆలోచన కూడా పిల్లల్లో కలగవచ్చు. ఎవరూ అర్థం చేసుకోవడం లేదని భావించవచ్చు. అందుకే ముందుగా పిల్లలకు భద్రత, భరోసా కల్పించాలి. వారి భావాలను అర్థం చేసుకుంటున్నామని తెలియజేయాలి.

35
పిల్లలు ఏడుపు ఆపేందుకు ఫన్నీ యాక్టివిటీస్

ట్రాంపోలిన్‌పై గెంతించడం

పిల్లలు ట్రాంపోలిన్‌పై గెంతడం వల్ల శరీరానికి మంచి వ్యాయామంలా ఉంటుంది. ఒత్తిడిగా ఉన్నప్పుడు శారీరకంగా చురుగ్గా కదిలి పిల్లలకు ఉపశమనం కలుగుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి గెంతి, ఆ తర్వాత శరీరం ఎలా అనిపిస్తోందో అడగవచ్చు.

దూకే ఆటలు

పిల్లలకు ఎక్కడం, పాకడం, బ్యాలెన్స్ చేసుకుంటూ నడవడం, చిన్న చిన్న అడ్డంకులను దాటడం వంటి ఆటలు ఆడించవచ్చు. ఇలాంటి యాక్టివిటీల్లో శరీరంలోని వివిధ భాగాలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పిల్లలు తమ కదలికలపై దృష్టి పెట్టగలుగుతారు. ఇంట్లోనే దిండ్లు, సురక్షితమైన ఆట వస్తువులతో ఇలాంటి ఫన్నీ యాక్టివిటీస్ చేయొచ్చు.

ఈత లేదా నీటితో ఆటలు

నీటిలో ఆడుకోవడం చాలామంది పిల్లలకు ప్రశాంతమైన అనుభూతిని ఇస్తుంది. నీటిలో కదలడం, చేతులతో నీటిని తాకడం, ఒక పాత్ర నుంచి మరో పాత్రలోకి నీటిని పోయడం వంటి పనులు వారిని ఆటలో నిమగ్నం చేస్తాయి. ఈత కొట్టడం, బొమ్మలను నీటితో కడగడం, చిన్న కప్పుల్లో నీటిని నింపడం వంటి పనులు చేయించవచ్చు. అయితే నీటితో ఆడుకునేటప్పుడు పిల్లలను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలకూడదు.

సబ్బు బుడగలు ఊదించడం

పిల్లలకు సబ్బు బుడగలు ఊదడం అంటే చాలా ఇష్టం. ఈ ఆట ద్వారా వారికి తెలియకుండానే నెమ్మదిగా శ్వాస తీసుకోవడం, ఎక్కువ సమయం పాటు గాలిని బయటకు వదలడం అలవడుతుంది. ఇది శరీరాన్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకెళ్లేందుకు సహాయపడుతుంది. పెద్ద బుడగలు వచ్చేలా నెమ్మదిగా గాలి ఊదమని చెప్పాలి. పిల్లలు ఆటలోనే శ్వాసను నియంత్రించుకోవడం నేర్చుకుంటారు.

45
ఫన్నీ యాక్టివిటీస్

జంతువుల్లా నడవడం

పిల్లలకు జంతువుల్లా నడిచే ఆటలు కూడా మంచి వ్యాయామం. ఎలుగుబంటిలా చేతులు, కాళ్లపై పాకడం, పీతలా పక్కకు నడవడం, కప్పలా గెంతడం, పెంగ్విన్‌లా నడవడం వంటి ఆటలు ఆడించవచ్చు.

డ్యాన్స్ చేయించడం

పిల్లలకు ఇష్టమైన పాటలు పెట్టి డ్యాన్స్ చేయించండి. ఎంజాయ్ చేస్తారు. వ్యాయామంలా ఉంటుంది కూడా. ఇది పిల్లలకు ఉల్లాసాన్ని ఇవ్వడంతో పాటు ప్రశాంతంగా మారేందుకు తోడ్పడుతుంది.

క్లేతో ఆడించడం

పిల్లలకు మట్టి, క్లే, ప్లే డో లేదా కైనెటిక్ శాండ్‌తో ఆడుకోవడం మంచి అనుభూతిని ఇస్తుంది. వాటితో బంతులు చేయడం, నొక్కడం, సాగదీయడం, రకరకాల ఆకారాలు తయారుచేయడం వంటి పనులు చేయవచ్చు. చేతులతో ఏదైనా వస్తువును తయారు చేయడంపై దృష్టి పెట్టడం వల్ల పిల్లలు తమ భావోద్వేగాల నుంచి కాసేపు దృష్టి మళ్లించుకోగలుగుతారు. అంతేకాకుండా ఇలాంటి ఆటలు వారి సృజనాత్మకతను కూడా పెంచుతాయి.

55
తల్లిదండ్రులు ఏం చేయాలి?

పిల్లలు ఏడుస్తున్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు వారిని వెంటనే ఆపాలని ప్రయత్నించకండి. ముందుగా వారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏం జరిగిందో తెలుసుకోండి. వారి భావాలపై వెంటనే తప్పుపట్టకుండా, ఎలా వ్యక్తపరచాలో నేర్పించండి.

అలాగే ఈ యాక్టివిటీలను పిల్లలపై బలవంతంగా రుద్దకుండా సరదాగా పరిచయం చేయాలి. ఇదే సమయంలో తల్లిదండ్రుల సహనం, ప్రేమ, ప్రోత్సాహం కూడా ఎంతో ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories