పిల్లలకు ఏ విషయం గురించి సందేహం వచ్చినా అడిగే స్వేచ్ఛ ఉండాలి. తల్లిదండ్రుల పని, పేరు, గుర్తింపు గురించి ప్రశ్నించినప్పుడు వారిని తక్కువ చేయకుండా, ఇతరులతో పోల్చకుండా అర్థమయ్యేలా వివరించాలి. తమ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకునే క్రమంలో పిల్లలు ఒత్తిడికి గురికాకుండా చూడాలి.
ఈ సెలబ్రిటీల అనుభవాల నుంచి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. పిల్లలకు తమ హోదా కంటే తమతో ఉండే అనుబంధమే ఎక్కువ ముఖ్యం. లక్షల మంది అభిమానించే వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు పిల్లలతో ఆడుకోవచ్చు, హోంవర్క్‌లో సాయం చేయవచ్చు, వారి సమస్యలను వినవచ్చు. బయట ప్రపంచానికి వారు ఎంతటి ప్రముఖులైనా, పిల్లలకు మాత్రం అమ్మానాన్నలే.
ఇది కేవలం సెలబ్రిటీల కుటుంబాలకే పరిమితం కాదు. తల్లిదండ్రులు డాక్టర్లు, టీచర్లు, వ్యాపారవేత్తలు లేదా ఇతర రంగాల్లో విజయవంతమైన వ్యక్తులు కూడా ఉండొచ్చు. కానీ వారి విజయాలే పిల్లల గుర్తింపుగా మారకూడదు. పిల్లలు తమకంటూ అభిరుచులు, లక్ష్యాలు, ఆలోచనలు ఏర్పరచుకునేలా ప్రోత్సహించాలి.