Parenting: ప్రపంచంలో అత్యంత సంపన్నుల జాబితాలో బిల్ గేట్స్ పేరు ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఆయన దృష్టిలో అసలైన సంపద డబ్బు కాదు. మంచి విలువలు, బాధ్యతాయుతమైన జీవన విధానమే. పిల్లలు గొప్పవాళ్లు కావాలంటే ఆయన చెప్పిన కొన్ని పాఠాలు ఇప్పుడు చూద్దాం.
బిల్ గేట్స్ స్పష్టంగా చెప్పిన విషయం ఒక్కటే. తన సంపూర్ణ ఆస్తిని పిల్లలకు ఇవ్వబోనని. పిల్లలు తమ శ్రమతో తమకంటూ ఒక గుర్తింపు సంపాదించాలన్నదే ఆయన ఆశ. కష్టపడి సాధించిన విజయం వ్యక్తిత్వాన్ని బలపరుస్తుంది. జీవితం సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. అన్నీ సులువుగా దొరికితే జీవిత విలువ అర్థం కాదని గేట్స్ భావన.
25
ఖరీదైన వస్తువుల కంటే అనుభవాలే గొప్పవి
నిజమైన ఆనందం విలాస వస్తువుల్లో లేదని బిల్ గేట్స్ పిల్లలకు నేర్పారు. ప్రయాణాలు, కొత్త విషయాలపై అవగాహన, విభిన్న వ్యక్తులతో పరిచయాలు జీవితం విస్తృతంగా ఆలోచించేలా చేస్తాయి. అనుభవాల ద్వారా మనిషిలో సున్నితత్వం పెరుగుతుంది. ఆనందం కొనుగోలు చేసే వస్తువు కాదని ఆయన పిల్లలకు బలంగా చెప్పారు.
35
డబ్బు లక్ష్యం కాదు…
బిల్ గేట్స్ దృష్టిలో డబ్బు కూడబెట్టడం జీవిత లక్ష్యం కాదు. సమాజంలో మార్పు తీసుకురావడానికి అది ఒక సాధనం మాత్రమే. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఈ ఆలోచనను పిల్లలకు ఆచరణలో చూపించారు. ఎక్కువ వనరులు ఉన్నవారికి సమాజంపై ఎక్కువ బాధ్యత ఉంటుందని ఆయన నమ్మకం.
బిల్ గేట్స్ జీవితాంతం నేర్చుకునే వ్యక్తి. అదే అలవాటును తన పిల్లల్లో కూడా నాటారు. ప్రపంచంలో పేదరికం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ సమస్యలపై అవగాహన అవసరమని చెబుతారు. ప్రశ్నలు అడగడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఓపెన్ మైండ్‌తో ఆలోచించడం పిల్లలను ముందుకు నడిపిస్తుందని ఆయన విశ్వాసం.
55
వినయం, కరుణ లేకపోతే విజయం అసంపూర్ణం
ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా వినయం తప్పనిసరి అని బిల్ గేట్స్ చెప్తారు. అహంకారం మనిషిని దూరం చేస్తుంది. కరుణ మనిషిని మరింత మానవీయంగా మారుస్తుంది. ఇతరుల బాధ పట్ల స్పందించకుండా సాధించిన విజయం అర్థం లేనిదే అని ఆయన భావన. పిల్లలు ఏ స్థాయికి చేరినా మంచి మనుషులుగా ఉండాలన్నదే ఆయన భావన.