పిల్లల్ని మంచి స్కూల్ కి పంపించాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. కానీ ఏది మంచి స్కూల్ అనేదే ఇక్కడ ప్రశ్న. CBSE సిలబస్ బాగుంటుందని కొందరు, ICSE సిలబస్ టఫ్ అని మరికొందరు, స్టేట్ సిలబస్ ఎందుకు పనికిరాదని ఇంకొందరి అభిప్రాయం. అసలు ఈ మూడింటిలో ఏది మంచిది?
CBSE, ICSE, స్టేట్ సిలబస్‌లో ఏది మంచిదనే ప్రశ్న చాలామంది తల్లిదండ్రుల మనసులో ఉంటుంది. కానీ ప్రతి బోర్డు ప్రత్యేక లక్షణాలు, ప్రాధాన్యాలు, లోపాలు కలిగి ఉంది. కాబట్టి పిల్లల ఆసక్తులు, నేర్చుకునే విధానం, భవిష్యత్ లక్ష్యాలు, కుటుంబ పరిస్థితులు వంటివి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని స్కూల్ ఎంపిక చేయాలి. ఇక్కడ ఒక్కో బోర్డు గురించి పూర్తి వివరాలు అందించాం. మరి ఆలస్యమెందుకు చదివేయండి.
25
CBSE- Central Board of Secondary Education
CBSE భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన సిలబస్. ఈ బోర్డు ప్రధానంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, కాన్సెప్ట్ క్లారిటీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతుంది. NEET, JEE వంటి పరీక్షలకు సిద్ధం కావాలంటే CBSE మంచి ఎంపిక. సబ్జెక్ట్ ప్రెజెంటేషన్ సింపుల్‌గా ఉంటుంది కాబట్టి పిల్లలు అర్థం చేసుకోవడం సులభం. అంతేకాదు స్థిరమైన పాఠ్యాంశంతో కొన్ని ఏళ్లపాటు చదువు సాఫీగా కొనసాగుతుంది. అయితే CBSE సిలబస్‌లో డీప్ నాలెడ్జ్ తక్కువగా ఉంటుందనేది కొందరి వాదన.
35
ICSE- Indian Certificate of Secondary Education
ICSE సిలబస్ చాలా విస్తృతంగా, డీటైల్‌గా, డెప్త్‌గా ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి ICSE ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ చాలా మెరుగుపడతాయి. సైన్స్, మ్యాథ్స్, హిస్టరీ, జాగ్రఫీ ఇలా ప్రతి సబ్జెక్ట్‌ను విపులంగా చదివిస్తారు. కాబట్టి పిల్లల్లో లోతుగా ఆలోచించే విధానం పెరుగుతుంది. పై చదువులు విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారికి ICSE సబ్జెక్ట్‌లు చాలా సహాయపడతాయి. అయితే ICSE సిలబస్ కొంచెం టఫ్ గా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎక్కువగా చదవాలి. హోమ్ వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది.
స్టేట్ బోర్డులు ప్రతి రాష్ట్రానికి అనుగుణంగా ఉండే పాఠ్యాంశాలతో రూపొందించబడతాయి. ఈ సిలబస్ చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. లోకల్ కల్చర్, స్థానిక చరిత్ర, రాష్ట్ర భాషలకు ప్రాధాన్యం ఇవ్వడం మరో ముఖ్యమైన ప్రయోజనం. స్టేట్ సిలబస్‌లో చదువు కొంచెం సింపుల్‌గా ఉంటుంది. సబ్జెక్ట్ డెప్త్ CBSE లేదా ICSE కన్నా తక్కువ. మీ పిల్లలకు రాష్ట్ర భాషపై పట్టు ఉండాలి అనుకుంటే లేదా సింపుల్, తక్కువ ఒత్తిడితో చదివించే సిలబస్ కావాలంటే స్టేట్ బోర్డు సరైంది.
55
CBSE, ICSE, స్టేట్ సిలబస్‌లో ఏది మంచిది?
మీ పిల్లలు ఎలా నేర్చుకుంటారు, భవిష్యత్తులో ఏ రంగంలో ముందుకు వెళ్లాలి అనుకుంటున్నారు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని స్కూల్ ని ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా పిల్లల స్వభావం, మీ బడ్జెట్, స్కూల్ దూరం, బోధన నాణ్యత, టీచర్ల అనుభవం వంటివి కూడా బోర్డు కన్నా ఎక్కువ ప్రాధాన్యం కలిగినవి. మంచి స్కూల్‌లో చదివితే ఏ బోర్డు అయినా పిల్లలు బాగా నేర్చుకోగలరు. కాబట్టి పిల్లలకు ఏది సరిపోతుందో అర్థం చేసుకొని, ప్రశాంతంగా, ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.