పిల్లలకు జలుబు త్వరగా తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా?

Published : Nov 03, 2025, 05:12 PM IST

వాతావరణం మారినప్పుడు పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్య జలుబు. ముక్కు కారడం, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి వారిని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొన్ని సులభమైన, సహజమైన చిట్కాలు, జాగ్రత్తలతో పిల్లలకు జలుబు త్వరగా తగ్గేలా చేయవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

PREV
15
పిల్లలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి

సాధారణంగా జలుబు చేసినప్పుడు పిల్లల శరీరం వైరస్‌తో పోరాడుతుంటుంది. కాబట్టి వారికి సరైన విశ్రాంతి చాలా అవసరం. పిల్లలు ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారిని ఆడుకోనివ్వకుండా రెస్ట్ తీసుకునేలా చూడాలి. మంచి నిద్ర.. రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు త్వరగా తగ్గేలా సహాయపడుతుంది. పిల్లలను మొబైల్, టీవీలకు దూరంగా ఉంచి, ప్రశాంత వాతావరణంలో విశ్రాంతి కల్పించాలి.

25
ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వాలి

జలుబు ఉన్నప్పుడు పిల్లల శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. కాబట్టి నీరు, సూప్, వెచ్చని పాలు ఇతర ద్రవ పదార్థాలను తరచుగా ఇవ్వాలి. గోరువెచ్చని నీటిని కొద్దికొద్దిగా తాగించడం వల్ల జలుబు, గొంతు నొప్పి నుంచి కాస్త ఉపశమనం దక్కుతుంది. అలాగే రోజుకు రెండు సార్లు ఆవిరి పట్టించడం ద్వారా ముక్కు బ్లాక్ తగ్గి, పిల్లలు సులభంగా శ్వాస తీసుకుంటారు. 

35
వేడి ఆహారం ఇవ్వడం

పిల్లలకు జలుబు చేసినప్పుడు వేడి సూప్, వేడి అన్నం, మసాలా తక్కువగా ఉన్న ఆహారం ఇవ్వడం మంచిది. అలాగే తులసి ఆకులు, అల్లం ముక్కలు, తేనె కలిపి ఒక చెంచా ఇవ్వడం ద్వారా కూడా జలుబు తగ్గుతుంది. తేనె, అల్లం రసం కలిపి పిల్లలకు రోజుకు రెండు సార్లు కొద్ది కొద్దిగా ఇవ్వడం ద్వారా గొంతు శుభ్రమవుతుంది. కాస్త గోరువెచ్చని నువ్వుల నూనె లేదా కొబ్బరినూనెతో పాదాలు, ఛాతీ, వెన్నుపై మసాజ్ చేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. 

45
వాతావరణానికి సరిపోయే దుస్తులు

చలికాలంలో పిల్లల దుస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. పిల్లల శరీర ఉష్ణోగ్రతను బట్టి దుస్తులు మార్చాలి. బయటికి వెళ్తే చెవులు, ముక్కు కవర్ అయ్యేలా స్కార్ఫ్ లేదా టోపీ పెట్టడం మంచిది. జలుబు నుంచి త్వరగా కోలుకోవడానికి, మళ్లీ రాకుండా ఉండడానికి రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ వంటివి పిల్లలకు ఇవ్వాలి.  

55
డాక్టర్ దగ్గరికి వెంటనే తీసుకెళ్లాలి

సాధారణంగా పిల్లల్లో జలుబు 5 నుంచి 7 రోజులలో తగ్గిపోతుంది. కానీ జ్వరం మూడు రోజులకంటే ఎక్కువ ఉన్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా, చెవిలో నొప్పి లేదా దగ్గు ఎక్కువైతే, తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. వైద్యుల సూచన లేకుండా యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడకూడదు. దానివల్ల పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది.

Read more Photos on
click me!

Recommended Stories