పిల్లల భవిష్యత్ బాగుండాలంటే కచ్చితంగా నేర్పించాల్సిన 5 విషయాలు ఇవే!

Published : Oct 28, 2025, 04:32 PM IST

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు వేగంగా ముందుకెళ్తున్నారు. కానీ అదే సమయంలో విలువలు, మానవత్వం, దయ వంటి జీవిత సూత్రాలను మరిచిపోతున్నారు. పిల్లలు చక్కగా ఎదగాలన్నా, వారికి మంచి భవిష్యత్ ఉండాలన్నా.. పేరెంట్స్ వారికి ఈ విషయాలు కచ్చితంగా నేర్పించాలి.

PREV
16
పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన విషయాలు

పిల్లలు ఏ విలువలతో ఎదుగుతారో వాటి ఆధారంగా కుటుంబం, సమాజం రూపుదిద్దుకుంటుంది. పిల్లలకు పుస్తక జ్ఞానం మాత్రమే కాకుండా జీవన విలువలు, మానవత్వం, బాధ్యత, ప్రేమ వంటి అంశాలను నేర్పించడం పెద్దవాళ్ల బాధ్యత. ప్రస్తుతం టెక్నాలజీ పిల్లలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నా.. మానవ విలువలకు సంబంధించి వారు కొంత వెనకబడుతున్నారు. కాబట్టి చిన్న వయసులోనే కొన్ని ముఖ్యమైన విషయాలు పిల్లలకు నేర్పించడం అవసరం. అవేంటో చూద్దాం.

26
గౌరవం, మర్యాద

పిల్లలకు నేర్పించాల్సిన ముఖ్యమైన విషయాల్లో గౌరవం ఒకటి. పెద్దవారు, గురువులు, తోటివారు, స్త్రీ, పురుషుల పట్ల సమాన గౌరవం చూపించడం నేర్పించాలి. పేద, ధనిక భేదాలు చూడకుండా మనిషిని గౌరవించాలి అనే భావన చిన్నప్పటి నుంచే మనసులో నాటాలి. “థాంక్యూ”, “క్షమించు”, “ ప్లీజ్” వంటి మాటల వాడకం చిన్న విషయాల్లా కనిపించినా.. అవి మనిషిని గొప్పవాడిగా నిలబెడతాయి.

36
నిజాయతీ, బాధ్యత

పిల్లల జీవితంలో నిజాయతీ, బాధ్యత అనే విలువలు వారిని ఎక్కడికి తీసుకెళ్తాయో ఊహించలేము. నిజం చెప్పడం, తప్పు చేశానని ఒప్పుకోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటివి చిన్న వయసు నుంచే నేర్పించాలి. తమ పనిని తామే చేసుకోవడం, ప్రతి పనిని సమర్థవంతంగా పూర్తి చేయడం, చిన్న పనినైనా బాధ్యతగా చేయడం ద్వారా పెద్ద బాధ్యతల్ని కూడా ఈజీగా ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. 

46
సానుభూతి, దయ

ఇతరుల బాధను అర్థం చేసుకునే గుణం లేకుండా ఎదిగితే వారు ఎప్పుడూ ఒంటరిగానే మిగిలిపోతారు. కాబట్టి పిల్లలకు సానుభూతి, దయ అనే విలువలు నేర్పించడం చాలా ముఖ్యం. పాఠశాలలో స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు అండగా నిలబడటం లేదా ఇంట్లో వారికి సహాయం అవసరమైనప్పుడు చేయడం వంటివి దయ గుణానికి మొదటి అడుగులు. దయ అంటే కేవలం ఇవ్వడమే కాదు, ఇతరుల స్థితిని అర్థం చేసుకొని స్పందించడం కూడా.

56
క్రమశిక్షణ, సమయపాలన

జీవితంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణ, సమయపాలన అత్యవసరం. సమయానికి పనులు పూర్తి చేయడం, పాఠశాలకు టైంకి వెళ్లడం, పనులు వాయిదా వేయకపోవడం వంటివి పిల్లలకు నేర్పించాలి. “సమయం వెనక్కి రాదు” అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల సమయాన్ని గౌరవించడం ద్వారా వారిలో ఈ గుణాన్ని పెంచవచ్చు. క్రమశిక్షణ అంటే కేవలం నియమాలను పాటించడం కాదు. మన ఆలోచనల్లో, మాటల్లో, ప్రవర్తనలో స్థిరత్వం కలిగి ఉండడమూ క్రమశిక్షణలో భాగమే.

66
స్వతంత్ర ఆలోచన, ఆత్మవిశ్వాసం

పిల్లలు జీవితంలో విజయవంతం కావాలంటే వారు స్వతంత్రంగా ఆలోచించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులే నిర్ణయిస్తే.. పిల్లలు స్వతంత్రత కోల్పోతారు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లోనైనా వారే ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలి. అదే ఆత్మవిశ్వాసానికి మూలం. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు భవిష్యత్తులో ఎదురైన ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కోగలరు.

Read more Photos on
click me!

Recommended Stories