Child Psychology: పిల్లలను అతిగా గారాబం చేస్తున్నారా? పెద్దయ్యాక వాళ్లు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

Published : Jan 06, 2026, 03:54 PM IST

Child Psychology: ప్రస్తుత రోజుల్లో చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలను చాలా ఎక్కువగా గారాబం చేస్తున్నారు. తమ పిల్లలు ఏడవ కూడదని, వాళ్లు అడిగిందీ, అడగనివీ అన్ని తెచ్చి ఇస్తూ ఉంటారు. మరి, అతిగా గారాబం చేస్తే ఏమౌతుందో తెలుసా? 

PREV
13
Child Psychology

పిల్లలను అతిగా గారాబం చేయడాన్ని సైకాలజీలో ‘ Indulgent Parentng ’ లేదా ‘ Over Indulgance’ అని పిలుస్తారు. ప్రేమ పేరుతో పిల్లలు అడిగినవన్నీ ఇవ్వడం, వారు తప్పు చేసినా ప్రశ్నించకపోవడం వల్ల వారి వ్యక్తిత్వం అసంపూర్ణంగా ఎదుగుతుంది.

చిన్నతనంలో అతిగా గారాబం పొందిన పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారో ఇప్పుడు తెలుసుకుందాం..

23
1. కష్టాలను తట్టుకోలేకపోవడం (Low Frustration Tolerance)

చిన్నప్పుడు వారు అడిగింది వెంటనే లభించడం వల్ల, "వేచి చూడటం" (Patience) అనేది వారికి తెలియదు. పెద్దయ్యాక ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో ఏదైనా ఆలస్యమైనా లేదా అనుకున్నది జరగకపోయినా వారు విపరీతమైన అసహనానికి, ఆందోళనకు గురవుతారు.

2. బాధ్యతారాహిత్యం (Lack of Responsibility)

గారాబం చేసే తల్లిదండ్రులు పిల్లల పనులన్నీ వాళ్లే చేసేస్తుంటారు (ఉదాహరణకు: గది సర్దడం, హోంవర్క్ చేయించడం). దీనివల్ల పెద్దయ్యాక కూడా వీరు తమ పనుల కోసం ఇతరులపై ఆధారపడుతారు. తమ తప్పులకు ఇతరులను నిందించడం (Blame shifting) వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది.

3. అంతా నాకే దక్కాలి అనే భావన (Sense of Entitlement)

"నేను ప్రత్యేకం, నాకు అన్నీ దక్కాలి, అందరూ నా మాటే వినాలి" అనే అహంకారం వీరిలో పెరుగుతుంది. సమాజంలో లేదా ఆఫీసులో ఇతరులతో సమానంగా ఉండటం వీరికి నచ్చదు. దీనివల్ల వీరు సామాజికంగా ఒంటరయ్యే ప్రమాదం ఉంది.

33
4. సంబంధ బాంధవ్యాలలో విఫలం (Relationship Issues)

స్నేహంలో లేదా ప్రేమలో "ఇవ్వడం , పుచ్చుకోవడం" (Give and Take) ఉండాలి. కానీ అతి గారాబంలో పెరిగిన వారు కేవలం తీసుకోవడానికే (Taking) అలవాటు పడతారు. భాగస్వామి తన ప్రతి కోరికను తీర్చాలని కోరుకుంటారు, లేకపోతే ఆ బంధం నుండి త్వరగా బయటకు వచ్చేస్తారు.

5. నిర్ణయాలు తీసుకోలేకపోవడం (Indecisiveness)

పిల్లల తరపున నిర్ణయాలన్నీ తల్లిదండ్రులే తీసుకోవడం వల్ల, పెద్దయ్యాక వారు ఒక చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా భయపడతారు. ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం వల్ల ఎప్పుడూ ఒకరి సలహా కోసం వెతుకుతుంటారు.

6.  చెడు వ్యసనాలకు లోనయ్యే అవకాశం

సైకాలజీ ప్రకారం, అతి గారాబం వల్ల పిల్లల్లో క్రమశిక్షణ (Self-discipline) లోపిస్తుంది. జీవితంలో ఏదైనా చిన్న ఒత్తిడి ఎదురైనా, దాని నుండి తప్పించుకోవడానికి వీరు సులభంగా మత్తు పదార్థాలకు లేదా ఇతర వ్యసనాలకు బానిసలుగా మారే అవకాశం ఉంది.

7. కృతజ్ఞత లేకపోవడం (Lack of Gratitude)

అన్నీ అడగకముందే దొరకడం వల్ల, వారికి వస్తువుల విలువ లేదా మనుషుల కష్టం విలువ తెలియదు. ఎంత ఇచ్చినా తృప్తి చెందకపోవడం వీరి ప్రధాన లక్షణం.

8. సామాజిక నైపుణ్యాల లోపం (Poor Social Skills)

బయటి ప్రపంచం ఇంట్లోలా ఉండదు. ఇంట్లో అందరూ తనని నెత్తిన పెట్టుకుంటారు, కానీ బయట అందరూ అలా ఉండరు. ఈ విషయాన్ని వారు జీర్ణించుకోలేక, నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడతారు.

తల్లిదండ్రులకు సైకాలజిస్టుల సలహా:

పిల్లలను ప్రేమించడం వేరు, గారాబం చేయడం వేరు.

ప్రేమ: పిల్లల భావోద్వేగాలకు విలువ ఇవ్వడం, వారికి అండగా ఉండటం.

గారాబం: వారు చేసే తప్పులను వెనకేసుకురావడం, అనవసరమైన కోరికలు తీర్చడం.

గుర్తుంచుకోండి: మీరు ఈ రోజు వారిని కష్టాల నుండి రక్షించవచ్చు, కానీ అలా చేయడం ద్వారా రేపు వారు ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తిని కోల్పోయేలా చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories