మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదని ఫీలౌతున్నారా? ఇదొక్కటి తినిపిస్తే చాలు..!

Published : Aug 20, 2025, 03:51 PM IST

మీ పిల్లలు ఎత్తు పెరగడం లేదని బాధపడుతున్నారా? అయితే.. కేవలం మీ పిల్లల డైట్ లో ఈ ఒక్క పౌడర్ చేర్చితే చాలు.

PREV
14
kids height

వయసుకు తగినట్లు పిల్లలు ఎత్తు, బరువు ఉంటేనే..వారు ఆరోగ్యంగా ఉంటారు. అయితే, చాలా మంది తమ పిల్లలు ఎత్తు పెరగడం లేదని ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లల హైట్ పెరగడానికి ఏవైనా మంచి ఫుడ్ ఉంటే చెప్పండి అని చాలా మంది డాక్టర్స్ ని అడుగుతూ ఉంటారు. కొందరు అయితే ఏకంగా మందులు వాడుతూ ఉంటారు. అయితే.. కేవలం ఒక పౌడర్ ని పిల్లల డైట్ లో భాగం చేయడం వల్ల మంచిగా, హెల్దీగా పిల్లలు ఎదగగలరు. కొన్ని రకాల ఫుడ్స్ లో గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల ఎత్తు పెరగడానికి సహాయపడుతుందని డైటీషియన్ మన్ ప్రీత్ చెప్పారు. ఆమె ఢిల్లీ యూనివర్శిటీ నుంచి న్యూట్రిషన్స్ లో మాస్టర్స్ చేశారు. మరి, ఆమె ప్రకారం.. గ్రోత్ హార్మోన్ బూస్టింగ్ పౌడర్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం....

24
గ్రోత్ హార్మోన్ బూస్టింగ్ పౌడర్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావాల్సిన పదార్థాలు..

అవిసె గింజలు - 1 టీస్పూన్

బాదం – 10

వాల్‌నట్స్ – 5-6

గుమ్మడికాయ గింజలు – 1 టీస్పూన్

కొబ్బరి (తురిమిన) – 1 టీస్పూన్

ఖర్జూరపు పొడి - 1 టీస్పూన్

కోకో పౌడర్ – 1 టీస్పూన్

తయారు చేసే విధానం

ముందుగా, అవిసె గింజలు, బాదం, వాల్‌నట్‌లు, గుమ్మడికాయ గింజలు , కొబ్బరిని పాన్‌లో తేలికగా వేయించాలి.ఇప్పుడు ఈ వేచించిన పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి మంచి పౌడర్ లా చేసుకోవాలి. ఈ పొడికి ఖర్జూర పొడి,కోకో పౌడర్ కలిపితే సరిపోతుంది.దీనిని ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.

34
ఈ పౌడర్ ని పిల్లలకు ఎలా ఇవ్వాలి..?

ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు, ఒక చెంచా పొడిని గోరువెచ్చని పాలు లేదా నీటిలో కలిపి పిల్లలకు త్రాగడానికి ఇవ్వండి. రాత్రిపూట దీన్ని తీసుకోవడం వల్ల గ్రోత్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.

వాల్నట్స్- వాటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ ఉంటాయి. ఇవి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. మంచి నిద్రను ప్రేరేపిస్తాయి.

అవిసె గింజలు – వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోన్ల సమతుల్యతకు చాలా ముఖ్యమైనవి.

బాదం- బాదంపప్పులో అర్జినిన్ అనే మూలకం ఉంటుంది. ఇది సహజంగా గ్రోత్ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.

గుమ్మడికాయ గింజలు – వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది పెరుగుదల హార్మోన్ల సంశ్లేషణ , ఎముక పెరుగుదలకు అవసరం.

కొబ్బరి- ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.

ఖర్జూర పొడి – ఇది శక్తి , ఖనిజాల సహజ మూలం. ఇది శరీర కణజాలాలను నిర్మించడంలో సహాయపడుతుంది.

కోకో పౌడర్- దీంట్లో మెగ్నీషియం , యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

44
ఈ గ్రోత్ పౌడర్ పిల్లలకు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు...

ఈ గ్రోత్ పౌడర్ పిల్లలకు ఇవ్వడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అన్నీ సహజ ఉత్పత్తులు ఉంటాయి. కాబట్టి... ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదు. దీనిని తీసుకోవడం వల్ల పిల్లలు చక్కగా ఎత్తు పెరుగుతారు. ఎముకలు, కండరాల పెరుగుదల కూడా బాగుంటుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories