ఆకు కూరలు, వెల్లుల్లి...
పాలిచ్చే తల్లులు తమ ఆహారంలో ఆకుకూరలను ఖచ్చితంగా చేర్చుకోవాలి. మునగ ఆకు, పాలకూర, మెంతి కూర లాంటివి రోజుకి కనీసం ఒక్క ఆకు కూర అయినా తినాలి. వీటిలో ఉండే కాల్షియం , ఫైబర్ పిల్లల శారీరక అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అంతేకాదు.. వెల్లుల్లి కూడా డైట్ లో భాగం చేసుకోవాలి. నల్ల ఎండు ద్రాక్ష తీసుకున్నా కూడా పాలు బాగా వస్తాయి. అంతేకాకుండా... ఆరోగ్యంగా ఉండేందుకు..బాదం పప్పు, జీడి పప్పు, ఖర్జూరం, అంజూర వంటి వాటిని తినాలి. ఇవి కూడా పాల ఉత్పత్తిని పెంచుతాయి.
కార్బోహైడ్రేట్స్...
చాలా తల్లులు బరువు పెరుగుతామనే భయంతో అన్నం తక్కువగా తింటారు. కానీ కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. కాబట్టి అన్నం, చపాతీ, మిల్లెట్ ఫుడ్స్ (జొన్న, రాగి, సజ్జ) ను పరిమిత మోతాదులో తినాలి. ఆకలిని చంపుకోకూడదు.