మీ పిల్లలు పొట్టిగా ఉన్నారా? ఈ కూరగాయలు పెట్టండి హైట్ బాగా పెరుగుతారు

Published : Oct 04, 2025, 11:40 AM IST

Height Growth: కొంతమంది పిల్లలు చాలా పొట్టిగా ఉంటారు. ఈ పిల్లలు హైట్ పెరగాలని తల్లిదండ్రులు ఏవోవే ఆహారాలను పెడుతుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయల్ని పెట్టినా పిల్లలు బాగా హైట్ పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?

PREV
16
పిల్లలు హైట్ పెరగాలంటే ఏం పెట్టాలి?

పిల్లలు హెల్తీగానే కాదు మంచి హైట్ కూడా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి కోరుకుంటారు. అయితే కొంతమంది పిల్లలు బాగా హైట్ ఉంటే, కొంతమంది పిల్లలు మాత్రం పొట్టిగా ఉంటారు. ఏజ్ పెరుగుతున్నా హైట్ పెరగకపోవడం తల్లిదండ్రులను కలవరపెడుతుంది. 

నిజానికి పిల్లల హైట్ ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. అంటే జెనెటిక్స్, ఫుడ్, వ్యాయామం, లైఫ్ స్టైల్, నిద్ర వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మంచి హెల్తీ ఫుడ్ పిల్లల హైట్ ను పెంచడమే కాకుండా.. వారి శరీరాన్ని బలంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 అయితే కొన్ని రకాల కూరగాయలు పిల్లల హైట్ ను పెంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
పిల్లల హైట్ ను పెంచే కూరగాయలు

ఆకు కూరలు

ఆకు కూరల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా కాల్షియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, ఫైబర్, మెగ్నీషియం, ఫోలెట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మన ఎముకల్ని, దంతాల్ని బలంగా ఉంచడానికి, కంటి చూపు మెరుగుపడటానికి, శరీరంలో రక్తం పెరగడానికి సహాయపడతాయి.

 అంతేకాదు మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచేందుకు సహాయపడతాయి. అంతేకాదు ఆకుకూరల్లోని పోసఖాలు ఎముకల పెరుగుదలకు కూడా సహాయపడతాయి. కాబట్టి మీ పిల్లలు పొట్టిగా ఉంటే ఆకు కూరలను బాగా పెట్టండి.

 ముఖ్యంగా క్యాబేజీ, కాలె, బ్రోకలీ వంటి వాటిని పెట్టండి. ఇవి మీ పిల్లల శరీరాన్ని హెల్తీగా ఉంచడమే కాకుండా వారు ఆరోగ్యంగా హైట్ పెరిగేందుకు కూడా సహాయపడతాయి.

36
క్యారెట్లు

క్యెరెట్లు పోషకాలకు మంచి వనరు. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, బయోటిన్, ఫైబర్, విటమిన్ బి6, బీటా కెరోటిన్ వంటి పోషఖాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లను తినడం వల్ల కళ్లు బాగా కనిపించడం, కంటి ఆరోగ్యం మెరుగుపడటమే కాదు.. పిల్లలు బాగా హైట్ కూడా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 అంతేకాదు క్యారెట్లను తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది. అలాగే చర్మం హెల్తీగా ఉంటుంది. మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీ పిల్లల బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

46
పచ్చి బఠానీలు

పచ్చి బఠానీలను ఎక్కువగా కూరల్లో వాడుతుంటారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం. ఫోలేట్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

నిపుణుల ప్రకారం.. పచ్చి బఠానీలను తిన్నా పిల్లలు బాగా హైట్ పెరుగుతారు. మీ పిల్లలు హైట్ తక్కువగా ఉంటే వారి ఫుడ్ లో వీటిని చేర్చినా సరిపోతుంది. పచ్చి బఠానీలను తింటే మీ పిల్లల ఎముకలు బాగా ఎదుగుతాయి. అలాగే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అలాగే వీటిలోని కొన్ని పోషకాలు శరీర నిర్మాణానికి కూడా సహాయపడతాయి.

చిలగడదుంపలు

చిలగడదుంపలను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు. ఇవి తీయగా, టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీ పిల్లలు హైట్ పెరగడానికి వీటిని కూడా పెట్టొచ్చు. వీటిలో ఫైబర్, కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్ ఇ, విటమిన్ సి, మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ లు ఉంటాయి. చిలగడదుంపలు ఎముకల ఎదుగుదలకు సహాయపడతాయి. 

కాబట్టి వీటిని పిల్లలు హైట్ పెరిగేందుకు పెట్టొచ్చు. అలాగే ఇవి మీ పిల్లల శరీరాన్ని శక్తివంతంగా ఉంచేందుకు. జీర్ణశక్తిని మెరుగుపర్చడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు వీటిని తింటే పిల్లల్లో మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది.

56
పిల్లల హైట్ ను పెంచే ఇతర ఆహారాలు

పనీర్

నిపుణుల ప్రకారం.. పనీర్ కూడా పిల్లలు హైట్ పెరిగేందుకు సహాయపడుతుంది. దీనిలో కాల్షియంతో పాటుగా ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. దీనిలోని కాల్షియం, భాస్వరంలు ఎముకల ఎదుగుదలకు సహాయపడతాయి. కాబట్టి మీ పిల్లలు పొట్టిగా ఉంటే పనీర్ ను అప్పుడప్పుడు పెడుతూ ఉండండి. ఇది చాలా సులువుగా అరుగుతుంది. అలాగే తొందరగా కడుపు నిండుతుంది. దీనిలో ఉండే పోషకాలు మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

66
గుడ్లు

గుడ్లు మంచి పోషకాహారం. దీనిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మీ పిల్లలకు రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును పెట్టడం మంచిది. ఇది పిల్లల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వారు మంచి హైట్ పెరిగేందుకు కూడా సహాయపడుతుంది.

గుడ్డులో విటమిన్ బి12, విటమిన్ డి వంటి ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఈ రెండూ హైట్ పెరిగేందుకు సహాయపడతాయి. ఇకపోతే గుడ్డు పచ్చసొనలో కోలిన్, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచేందుకు, కండరాల అభివృద్ధికి సహాయపడతాయి. పిల్లల బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డును పెట్టడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories