పరీక్షల సమయంలో పిల్లలకు ఎలాంటి ఫుడ్ పెట్టాలి..?

First Published | Mar 11, 2024, 12:55 PM IST

 పరీక్షల సమయంలో మనం పిల్లలకు అందించే ఆహారం విషయంలో  చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కింది ఆహారాలను కనుక పిల్లలకు అందిస్తే.. వారిలో మెమరీ పవర్ పెరుగుతుంది. చవదివినదంతా గుర్తుంచుకుంటారు. మరి ఎలాంటి ఫుడ్స్ అందించాలో తెలుసుకుందాం..


ప్రస్తుతం పరీక్షల సమయం నడుస్తుంది.  పరీక్షలు అనగానే పిల్లలు అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. మామూలు పరీక్షలకే పిల్లల్లో కంగారు ఉంటుంది. ఇక పబ్లిక్ పరీక్షలు అంటే.. మరింత ఎక్కువగా భయపడిపోతూ ఉంటారు. సరిగా ఆహారం తినరు.. ఎంత చదివినా మర్చిపోతున్నాం అని కొందరు టెన్షన్ పడతారు. ఇలాంటి సమయంలో.. పిల్లలు తాము చదివినవన్నీ గుర్తుంచుుకోవాలన్నా...  పరీక్షలు మంచిగా రాయాలన్నా... వారి టెన్షన్ తగ్గిపోవాలన్నా అది కూడా పేరెంట్స్ చేతుల్లోనే ఉంది. అవును.. ఈ పరీక్షల సమయంలో మనం పిల్లలకు అందించే ఆహారం విషయంలో  చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కింది ఆహారాలను కనుక పిల్లలకు అందిస్తే.. వారిలో మెమరీ పవర్ పెరుగుతుంది. చవదివినదంతా గుర్తుంచుకుంటారు. మరి ఎలాంటి ఫుడ్స్ అందించాలో తెలుసుకుందాం..
 

fatty fish

1.ఫ్యాటీ ఫిష్..
చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యానికి, తెలివితేటలు పెంచడానికి సహాయపడతాయి. రెగ్యులర్ గా ఈ ఫ్యాటీ ఫిష్ ని  పిల్లలకు అందించాలి. ముఖ్యంగా పరీక్షల సమయంలో పిల్లలకు ఈ ఆహారం అందించడం చాలా అవసరం. వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా EPA, DHA లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడతాయి. కాబట్టి.. ఈ ఫుడ్ పెట్టడం వల్ల వారు చదివింది గుర్తుంచుకునే అవకాశం ఎక్కువగా ఉంది.
 


Eat blue berries

2.బ్లూ బెర్రీస్...
బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్  పుష్కలంగా ఉంటాయి.  ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. కాబట్టి... వీటిని కనుక పిల్లల ఆహారంలో భాగం చేసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. పిల్లలు చదివింది మర్చిపోతున్నాం అని బాధపడాల్సిన అవసరం  ఉండదు.
 

brocoli

3.బ్రోకలీ..
ఆరోగ్యకరమైన ఆహారంలో బ్రోకలీ కూడా ఒకటి. వీటిలో.. గ్లూకోసైనేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని కనుక ఆమారంలో భాగం చేసుకుంటే... మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది. బ్రెయిన్ పనితీరు మెరుగ్గా ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ చురుకుగా ఉంటారు.
 

pumpkin seeds


4.గుమ్మడి గింజలు..
పిల్లల ఆహారంలో మీరు గుమ్మడి గింజలను కూడా చేర్చాలి. ఎందుకంటే వీటిలో మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది.

Dark chocolate


5.డార్క్ చాక్లెట్..
చాక్లెట్స్ ఇష్టపడని పిల్లలు ఎవరూ ఉండరు. అయితే... నార్మల్ చాక్లెట్స్ కాకుండా.. వారికి డార్క్ చాక్లెట్ ఇవ్వడం అలవాటు చేయాలి. డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్, కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే... ఈ డార్క్ చాక్లెట్ తినడం వల్ల  పిల్లల్లో ఫోకస్ పెరుగుతుంది. మంచిగా చదువకోవడానికి సహాయపడుతుంది.

nuts

6.నట్స్..
పిల్లల ఆహారంలో నట్స్ కూడా భాగం చేయాలి. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఇలాంటి నట్స్ వారికి ఇస్తూ ఉండాలి. బాదంపప్పు, జీడిపప్పు, వాల్ నట్స్ లను ఇస్తూ ఉండాలి. వీటిలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఈ ఉంటాయి. ఇవి.. మెదడు చురుకుగా పని చేయడానికి సహాయపడుతుంది.

7.ఆరెంజెస్..
ఆరెంజెస్ లో... విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రెయిన్ సెల్స్ ని యాక్టివ్ చేయడానికి, మంచి పనితీరు మెరుగుపరచడానికి ఇవి కీలకంగా పని చేస్తాయి.

egg


8.కోడిగుడ్డు..
బ్రెయిన్ ఆరోగ్యానికి అవసరం అయ్యే చాలా న్యూట్రియంట్స్ కోడిగుడ్డులో పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి6, బి12, ఫోలేట్ వంటి న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి..ప్రతిరోజూ పిల్లల ఆహారంలో  గుడ్డును భాగం చేయాలి. అప్పుడు వారి మెదడు చురుకుగా పని చేస్తుంది. 

Latest Videos

click me!