పిల్లలు బాగా చదవాలంటే ఇలా చేయండి

First Published Mar 10, 2024, 12:28 PM IST

పిల్లలు ఆడుకోవడంలో చూపించే ఇంట్రెస్ట్ చదవడంలో అస్సలు చూపించరు. కానీ ఎప్పుడూ చూసినా ఆటే.. ఏం చదవడం లేదని తల్లిదండ్రులు మాత్రం పిల్లల్ని కొడుతుంటారు. కానీ తల్లిదండ్రులు కొన్ని పనులు చేస్తే పిల్లలు చదువులో ముందుంటారు. 
 

చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలకు చదువు చెప్పడం సలవాలు లాగే ఉంటుంది. అందులోనూ పిల్లలు పేరెంట్స్ చెప్పిన మాట అస్సలు వినరు. చదువు చెప్పినా పట్టించుకోరని చాలా మంది స్కూల్ అయిపోగానే ట్యూషన్స్ కి పంపుతుంటారు. ట్యూషన్ కు వెళ్లని పిల్లలు కూడా చాలా మందే ఉంటారు. కానీ పిల్లలకు ఆడుకోవడంపై ఉన్న ఇంట్రెస్ట్ చదవడంలో ఉండదు. అలాగని అలాగే వదిలేస్తే పిల్లలు చదువులో వీక్ అయిపోతారు. అందుకే పిల్లలు చదవడం లేదని చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్ని కొడుతుంటారు. అయితే పేరెంట్స్ కొన్ని పనులు చేస్తే పిల్లలు చదువులో ముందుంటారు. ఇందుకోసం పేరెంట్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

శ్రద్ధ

చాలా మంది తల్లిదండ్రులు బిజీగా ఉండటం వల్ల పిల్లలను స్కూల్ లేదా ట్యూషన్ నుంచి వచ్చినా.. పెద్దగా పట్టించుకోరు. ఈ రోజు స్కూల్లో లేదా ట్యూషన్ లో ఏం చెప్పారు అని అడగరు. పిల్లల చదవు విషయం మొత్తం టీచర్లపైనే వదిలేస్తారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. మీరు ఎంత బిజీగా ఉన్నా.. రోజులో కొంత సమయాన్ని మీ పిల్లలకు కేటాయించండి. ఏ రోజుకారోజు స్కూల్లో ఏం చెప్పారో అడగండి. అలాగే మీరు దగ్గరుండి పిల్లల్ని చదివించండి. రోజూ చదవడం అలవాలు చేయండి. వీటివల్ల మీ పిల్లలు చదువులో ముందుంటారు. 
 

ప్రశాంతమైన వాతావరణం 

పిల్లలు చదివేటప్పుడు, రాసేటప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ ఉండకూడదు. లేదంటే పిల్లలకు చదవడంపై ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే మీ పిల్లలు చదువుతున్నప్పుడు టీవీ ఆఫ్ చేయండి. గట్టిగట్టిగా మాట్లాడుకోవడం మానేయండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ పిల్లలు చదవులో అస్సలు వెనుకపడరు. 
 

బ్రేకులు కూడా అవసరమే

ఒకేదగ్గర ఎక్కువ సేపు కూర్చోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా చదువుకునేటప్పుడు. చాలా గంటలు ఒకేదగ్గర కూర్చొని చదివితే నిద్ర వస్తుంది. అలాగే చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకే 4-5 గంటల పాటు చదివిన తర్వాత కూడా వారిని అసైన్ మెంట్లు, హోం వర్క్ లు కంప్లీట్ చేయమని ఫోర్స్ చేయకండి. ఒకవేళ మీరు ఎంత చెప్పినా పిల్లలు అస్సలు చదవరు. మీ పిల్లలు శ్రద్ధగా చదవాలనుకుంటే అపుడప్పుడు బ్రేక్  ఇవ్వండి. బ్రేకుల మధ్య అంటే ప్రతి వర్క్ ను పూర్తి చేసిన తర్వాత  మీ పిల్లలన్ని ఖచ్చితంగా మెచ్చుకోండి. 
 

ఫార్మెట్ మార్చండి

పుస్తకాన్ని ఎక్కువ సేపు చదవమంటే పిల్లలకు బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే పుస్తకాలతో పాటుగా ఫోటోలు, వీడియోల రూపంలో కూడా మీ పిల్లలకు లెసెన్స్ అర్థమయ్యేట్టు వివరించండి. చాలా మంది పిల్లలు రాసేటప్పుడు అలసిపోతుంటారు లేదా ఊరికే చిరాకు పడుతుంటారు. అందుకే వీడియోల రూపంలో మీ పిల్లలకు చదువంటే బోర్ కొట్టకుండా చూడండి. 
 

రివిజన్ 

ప్రతిరోజూ ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవడం గొప్పేం కాదు. ఇలా ఎవ్వరైనా నేర్చుకుంటారు. కానీ ఇలా కొత్తదాన్ని నేర్చుకునే ప్రాసెస్ లో పాత విషయాన్ని మర్చిపోతుంటారు. అందుకే పిల్లలకు కొత్త పాఠాలు నేర్పించడంతో పాటుగా గత పాఠాలను కూడా రివిజన్ చేయండి. ఇలా చేయడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే ఎలాంటి స్ట్రెస్ కు గురికాకుండా ఎక్సామ్స్ రాస్తారు. 
 

click me!