ఆడపిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా?

First Published | Mar 10, 2024, 2:30 PM IST

నేటికీ కూడా చాలా మంది ఆడపిల్లల్ని ఒకలా, మగపిల్లల్ని ఒకలా చూస్తున్నారు. అంటే ఆడపిల్లలంటే తక్కువ, మగపిల్లలంటే ఎక్కువని భావిస్తుంటారు. ఆ ఉద్దేశంతోనే పెంచుతారు కూడా. కానీ ఇది వారిని వేరు చేసినట్టే అవుతుంది. అసలు ఆడపిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా? 

ఆడపిల్లలపై వివక్ష నేటికీ కూడా పోలేదు. ఒకప్పుడైతే ఇంకా ఎక్కువగా ఉండేది. ఈ లింగ వివక్ష ఎన్నో శతాబ్దాల నాటిది. కానీ అప్పటికీ, ఇప్పటికీ లింగ వివక్షలో మార్పులొచ్చాయి. ప్రతి తల్లిదండ్రులు కొడుకులతో సమానంగా కూతుర్లని కూడా చదివిస్తున్నారు. ఎంకరేజ్ చేస్తున్నారు. కానీ నేటికి కూడా చాలా మంది తల్లిదండ్రులు కొడుకులతో సమానంగా కూతుర్లని చూడటం లేదు. ఈ పనులను అబ్బాయిలు చేసేవని, ఇలా అబ్బాయిలే ప్రవర్తిస్తారని ఆంక్షలు విధిస్తుంటారు. అసలు ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

కొడుకులు, కూతుళ్ల మధ్య వ్యత్యాసం

కొడుకులు, కూతుళ్ల మధ్య వ్యత్యాసం పెంపకంలో అస్సలు ఉండకూడదు. కానీ చాలా మంది పేరెంట్స్ ఈ తప్పును చేస్తుంటారు. ఈ ఆధునిక యుగంలో కూడా కొడుకులకే ప్రాధాన్యం ఇస్తూ.. కూతుళ్లను సరిగా చూడని వారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మీ కూతుర్ల మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ తేడా మీరు మీ పిల్లలకూ చూపించకపోతే మీ కూతుర్లు కూడా ఉన్నతంగా ఎదుగుతారు. వాళ్లు కూడా మీ బాటలోనే నడుస్తారు. 


ఆడపిల్లలపై ఆంక్షలు 

ఆడ పిల్లలను పెద్దగా పట్టించుకోని వారి ఇండ్లలలో తల్లిదండ్రలు వారిపై అనేక ఆంక్షలు విధిస్తారు. స్కూలుకు ఎలా వెళ్లాలి? ఎలా ఇంటికి రావాలి? ఎలా ఆడుకోవాలి? ఏ బట్టలు వేసుకోకూడదు? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడకూడదు? ఎక్కువగా నవ్వకూడదు, ఎక్కువగా మాట్లాడకూడదంటూ ఎన్నో ఆంక్షలు విధిస్తారు. తల్లిదండ్రులను కాదని ఏదైనే చేస్తే కొట్టేవారు కూడా ఉన్నారు. కానీ కొడుకులకు మాత్రం ఏ విషయాలను చెప్పరు. వీళ్లను స్వేచ్ఛగా వదిలేస్తారు. కానీ ఈ ఆంక్షలు ఆడపిల్లల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. దీనివల్ల వారు భయంతో బతకొచ్చు. లేదా మీకు అబద్దాలు కూడా చెప్పొచ్చు. అందుకే ఇలాంటి పని మాత్రం చేయకండి. 

భావ ప్రకటనా స్వేచ్ఛ 

నేటికీ చాలా మంది ఆడపిల్లలు ఏం జరిగినా చెప్పుకోలేకపోతున్నారు. కారణం వారికి భావ ప్రకటనా స్వేచ్ఛ లేకపోవడం. దీనివల్ల వారిపై అత్యాచారాలు జరుగుతున్నా ఎవ్వరికీ చెప్పుకోలేకపోతున్నారు. పిల్లలు పెద్దయ్యాక కూడా ఈ అలవాటు అలాగే ఉంటుంది. గృహహింస, వేధింపులు అనుభవిస్తూనే ఉంటారు కానీ మాట్లాడేందుకు మాత్రం భయపడుతుంటారు.
 

కొడుకు, కూతురు పోలికలు..

చాలా మంది తల్లిదండ్రులు కూతుళ్లను కొడుకులతో పోల్చుతుంటారు. తమ తప్పొప్పులను, లోపాలను ఎప్పుడూ ఎత్తిచూపుతూనే ఉంటారు. ఇలా మంచి చేయమని మాత్రం ప్రోత్సహించరు. కానీ ఇతరులతో పోలిస్తే అమ్మాయిల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వారికి సామర్థ్యం ఉన్నప్పటికీ మీ మాటల వల్ల బలహీనంగా మారుతారు. ఈ పోలిక వల్ల జీవితంలో ఏదైనా చేయాలనే కోరిక కూడా చచ్చిపోతుంది.
 

ఆడుకోవడానికి బొమ్మలు 

అమ్మాయిలకు చిన్నప్పుడు ఆడుకోవడానికి కొన్ని రకాల బొమ్మలు మాత్రమే ఇస్తారు. కానీ అబ్బాయిలకు చాలా రకాల బొమ్మలు ఉంటాయి. ఈ బొమ్మల నుంచే వివక్ష మొదలవుతుంది. నిజమేంటంటే?  అమ్మాయిలు అబ్బాయిల కంటే మృదువుగా ఉంటారు. అందుకే తల్లిదండ్రులు వారిని బలంగా తయారుచేయాలి. అవుట్ డోర్ గేమ్స్ ఆడేలా వారిని ఎంకరేజ్ చేయాలి. ఇవన్నీ చేస్తే మీ కూతుర్లు గొప్ప స్థాయికి వెళతారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. 

Latest Videos

click me!