Parenting Tips: మీ పిల్లలు బరువు పెరగడం లేదా..? ఇవి తినిపిస్తే చాలు..!

Published : Sep 04, 2025, 01:27 PM IST

పిల్లలకు ఆరు నెలల వయసు దాటిన తర్వాత నుంచి ఆహారం పెట్టడం మొదలుపెట్టాలి. వారికి మొదట జీర్ణం అయ్యే ఆహారం ఇవ్వడం మొదలుపెట్టాలి.

PREV
14
kids eating

పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. మరీ ముఖ్యంగా పిల్లలు బరువు పెరగకపోతే.. ఎవరికైనా దిగులుగా ఉంటుంది. వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లి... ఆకలి పెరగడానికి, బరువు పెరగడానికి మందులు రాసి ఇవ్వమని అడుగుతూ ఉంటారు. కానీ... మనం కొన్ని ఆహారాల్లో మార్పులు చేసుకుంటే.. కచ్చితంగా పిల్లలు బరువు పెరుగుతారు. మరి.. ఎలాంటి ఆహారాలు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం...

24
పిల్లలకు పోషకాలు అందించే ఆహారాలు....

పిల్లలకు ఆరు నెలల వయసు దాటిన తర్వాత నుంచి ఆహారం పెట్టడం మొదలుపెట్టాలి. వారికి మొదట జీర్ణం అయ్యే ఆహారం ఇవ్వడం మొదలుపెట్టాలి.మెత్తగా స్మూత్ గా, గంజిలాగా చేసి అందించాలి. కొద్దిగా వయసు పెరిగితే... ఆ తర్వాత మీరు పిల్లలకు ఇడ్లీ, దోశ లాంటివి పెట్టడం మొదలుపెట్టవచ్చు. ఇడ్లీలో కొద్దిగా నెయ్యి చేర్చి... పిల్లలకు అందించాలి. నెయ్యి చేర్చడం వల్ల పిల్లలకు సులభంగా జీర్ణం అవుతుంది. కొద్ది కొద్దిగా రోజుకి 4 నుంచి 5 సార్లు అయినా పెట్టొచ్చు. దీని వల్ల పిల్లల కడుపు నిండుతుంది.

34
బరువు పెంచే ఆహారాలు..

పిల్లలు సులభంగా బరువు పెరగాలి అనుకుంటే.. మీరు వారికి అరటి పండు తినిపించడం మొదలుపెట్టాలి. అరటి పండ్లలోని పోషకాలు బరువు పెరగడానికి, కడుపులో జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయడానికి సహాయపడతాయి.

బాదం, వాల్‌నట్, ఖర్జూరం, పిస్తా, జీడిపప్పు మొదలైన వాటిని గంటసేపు బాగా నానబెట్టండి. తర్వాత వాటిని మిక్సర్‌లో రుబ్బుకోండి. ఈ పేస్టును నీటి తో కలిపి.. బాగా మరగనివ్వాలి. జావలాగా చేసి.. ఆరిన తర్వాత పిల్లలకు అందిస్తే సరిపోతుంది.

44
కూరగాయలు, పప్పులతో అన్నం...

కుక్కర్‌లో పప్పు, బియ్యం, గుమ్మడికాయ, కొన్ని కూరగాయలు మొదలైన వాటిని నీటితో మరిగించండి. బాగా ఉడికిన తర్వాత, దానికి కొద్దిగా నెయ్యి వేసి, మెత్తగా చేసి పిల్లలకు ఇవ్వండి. మీరు మొదటిసారి పిల్లలకు అన్నం అలవాటు చేస్తున్నట్లయితే...నెయ్యి వేసి.. కొద్ది కొద్దిగా మాత్రమే అలవాటు చేయాలి. కొద్ది కొద్దిగా పిల్లలకు పెట్టే ఫుడ్ క్వాంటిటీ పెంచుతూ ఇవ్వాలి. అప్పుడే.. పిల్లల ఆకలి పెరుగుతుంది. ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.

Read more Photos on
click me!

Recommended Stories