7-8 ఏళ్లకే పిల్లలకు పీరియడ్స్.. కారణం ఏంటి?

Published : Aug 23, 2025, 06:14 PM IST

ఇటీవలి కాలంలో  7-8 ఏళ్ల వయసులోనే ఆడపిల్లలకు పీరియడ్స్ మొదలౌతున్నాయి. ఇంత చిన్న వయసులోనే పీరియడ్స్ రావడానికి కారణం ఏంటి? దీని గురించి పేరెంట్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. 

PREV
15
చిన్న వయసులోనే పీరియడ్స్

ఒకప్పుడు  12, 13 ఏళ్ల తర్వాత మాత్రమే ఆడ పిల్లల్లో పీరియడ్స్ మొదలయ్యేవి. కానీ,  ప్రస్తుతం బాగా మారిపోయింది. ఈ కాలం అమ్మాయిల్లో అనేక రకాల శారీరక, మానసిక మార్పులు చాలా చిన్న వయసులోనే కనపడుతున్నాయి.  ముఖ్యంగా 7-8 సంవత్సరాలు దాటగానే మొదటి పీరియడ్స్ మొదలౌతున్నాయి.  ఇది సహజమైనది కాదు. చాలా ఆందోళన చెందాల్సిన విషయం ఇది. మరి, దీని గురించి ప్రతి తల్లిదండ్రులు ఏం తెలుసుకోవాలి? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం…

25
శారీరక, మానసిక ఆరోగ్యం..

ఆడపిల్లలు చిన్న వయస్సులోనే యుక్తవయస్సుకు చేరుకుంటున్నారు. ఈ పరిస్థితిని అకాల యవ్వనం అంటారు. ఇది శారీరకంగానే కాకుండా మానసిక, సామాజిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది.

35
చిన్న వయసులోనే యుక్త వయసు..

అకాల యవ్వనం అంటే పిల్లలు సాధారణం కంటే ముందుగానే యుక్తవయస్సుకు చేరుకునే పరిస్థితి. ఆడపిల్లల్లో ఇది సాధారణంగా 8 సంవత్సరాల కంటే ముందు ఋతుచక్రం ప్రారంభమయ్యే రూపంలో కనిపిస్తుంది. ఈ పరిస్థితి హార్మోన్ల మార్పుల వల్ల కలుగుతుంది.

45
ఆహారమే కారణమా?

సరైన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు.  అలాగే, మారుతున్న పర్యావరణం లేదా వాతావరణ మార్పు కూడా దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఇటీవలి కాలంలో, పిల్లల ఆహారంలో ప్రతిదీ కల్తీ లేదా రసాయనాలతో నిండి ఉంది. 

55
కల్తీ ఆహారం..

పిల్లల పుట్టిన తర్వాత, పాల నుండి ఆహారం వరకు ప్రతిదీ కల్తీ అవుతుంది. దీనితో పాటు, పిల్లల మంచి ఎదుగుదల కోసం గ్రోత్ హార్మోన్లను ఉపయోగిస్తారు, ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. అంతేకాకుండా, ప్లాస్టిక్ ఆహార ప్యాకేజింగ్‌లో ఉండే BPA (బిస్ఫెనాల్ A) వంటి రసాయనాలు హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. వీటన్నింటి వల్లనే.. చిన్న వయసులోనే పిల్లలకు పీరియడ్స్ మొదలౌతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories