పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏ ఫుడ్స్ పెట్టొచ్చు? ఏ ఫుడ్స్ పెట్టకూడదు?

Published : Nov 17, 2025, 05:19 PM IST

సాధారణంగా పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు ఫుడ్ సరిగ్గా తీసుకోరు. వారికి ఏ ఫుడ్ పెట్టాలో.. ఏది పెట్టకూడదో తెలియక పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతుంటారు. పిల్లలు జ్వరంతో ఉన్నప్పుడు సరైన ఆహారం ఇవ్వకపోతే శరీరం శక్తిని కోల్పోతుంది. వారు కోలుకోవడం ఆలస్యమవుతుంది. 

PREV
15
పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు పెట్టాల్సిన ఫుడ్స్

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు ఏ ఫుడ్ పెట్టొచ్చు? ఏ ఫుడ్ పెట్టకూడదనే సందేహం చాలామంది పేరెంట్స్ లో ఉంటుంది. నిజానికి జ్వరం సమయంలో పిల్లల శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడుతుంది. దానివల్ల శరీరానికి కావాల్సిన శక్తి, నీరు, పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి ఈ సమయంలో ఆహారం తేలికగా, త్వరగా జీర్ణం అయ్యేలా, శరీరాన్ని హైడ్రేట్ చేసేలా ఉండాలి. పిల్లలకు జ్వరం ఉన్నప్పుడు ఆకలి తగ్గడం సహజం. కానీ తక్కువ మోతాదులో అయినా సరే.. సరైన ఆహారం ఇవ్వడం అవసరం.  

25
హైడ్రేషన్ అవసరం

జ్వరం ఉన్నప్పుడు చెమట ద్వారా శరీరం నీటిని ఎక్కువగా కోల్పోతుంది. ఈ తగ్గిన నీటి శాతాన్ని భర్తీ చేయడానికి నీళ్లు, ORS, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, రాగి జావ, గంజీ వంటి వాటిని ఇవ్వడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్, మినరల్స్ ఇస్తాయి. తక్కువ మోతాదులో తరచుగా ఇవ్వాలి. ఒకేసారి ఎక్కువగా తాగిస్తే వాంతి చేసుకునే అవకాశం ఉంటుంది. 

35
ఈజీగా జీర్ణమయ్యే ఫుడ్స్

జ్వరంతో ఉన్నప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు ఇవ్వడం మంచిది. వెజిటేబుల్ సూప్, మినప పప్పు చారు, కిచిడి, దోశ, ఇడ్లీ, అరటి పండు వంటి ఆహారాలు ఇవ్వొచ్చు. జ్వరంతో ఉన్నప్పుడు ప్రోటీన్ కూడా అవసరం. కానీ అది తేలికగా జీర్ణం అయ్యే రూపంలో ఉండాలి. పెసరపప్పు, మినప పప్పు, సజ్జలతో చేసిన ఆహారాలు మంచి ఎంపిక. ప్రోటీన్ శరీరానికి శక్తిని అందించడమే కాక, ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. 

45
ఏ ఫుడ్స్ పెట్టకూడదంటే?

పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు వేయించిన పదార్థాలు, నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు, బజ్జీలు, పకోడీలు, చిప్స్ వంటివి పెట్టకూడదు. ఇవి త్వరగా జీర్ణం కావు, కడుపునొప్పి, అజీర్తి కలగవచ్చు. అలాగే ఐస్‌క్రీం, కోల్డ్ డ్రింక్స్ వంటివి ఇవ్వకూడదు. ఇవి గొంతును మరింత దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే మసాలా ఎక్కువగా ఉన్న ఫుడ్స్, స్పైసీ కర్రీస్, ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకూడదు. ఇవి పిల్లల్లో అలసటను పెంచుతాయి.

55
తీపి పదార్థాలు

జ్వరంతో ఉన్న పిల్లలకు చాక్లెట్స్, కేక్, జ్యూస్ వంటి తీపి పదార్థాలు కూడా తగ్గించాలి. షుగర్ ఎక్కువ ఉన్న ఆహారం శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరగడానికి, ఇమ్యూనిటీ తగ్గడానికి కారణం అవుతుంది. ప్యాక్డ్ ఫుడ్స్ లేదా రెడీమేడ్ సూప్స్, నూడుల్స్ వంటి ప్రాసెస్డ్ ఆహారాలు కూడా ఇవ్వకూడదు. ఇవి పిల్లలకు కడుపునొప్పి, మలబద్ధకం కలిగించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories