Parenting Tips: పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. ఎక్కువ నీళ్లు తాగడం, సరైన సమయానికి సరైన ఆహారం తినడం, ఆడుకోవడం వంటి ఎన్నో అలవాట్లు పిల్లల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
తినడం అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. కాబట్టి మనం ఏది తిన్నా, అది మన శరీరానికి ఆరోగ్యకరంగా, పోషకాలు ఇచ్చేలా ఉండాలి. పిల్లలకు చిన్నప్పుడే ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను వివరించాలి. జంక్ ఫుడ్ తింటే కలిగే నష్టాలను కూడా వారికి వివరించండి.
28
నీరు ఎక్కువగా తాగడం....
నీరు తాగడం జీవక్రియను పెంచుతుంది. మన జీర్ణవ్యవస్థ సరిగా పని చేయడానికి సహాయపడుతుంది. పిల్లలు ప్రతిరోజూ కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగేలా ప్రోత్సహించాలి. వేసవిలో వీలైనంత హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
38
ఖాళీగా కూర్చోవద్దు...
గడిచిన సమయం ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి.. సోమరితనంతో కూర్చొని సమయాన్ని వృథా చేయకూడదు. ఈ విషయాన్ని మనం పిల్లలకు కచ్చితంగా నేర్పించాలి. పిల్లలకు చిన్న చిన్న పనులను అప్పగించాలి.
మీరు మీ కుటుంబంతో, స్నేహితులతో ఉన్నా ఎలా సంతోషంగా గడుపుతున్నారో… మీ పిల్లలు కూడా కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ప్రోత్సహించాలి. దీని వల్ల వారికి కుటుంబ ప్రాముఖ్యత, సంబంధాల విలువ పిల్లలకు తెలుస్తుంది.
58
ఈ విషయాలను గమనించాలి....
మీరు ఏది విన్నా, అన్నింటినీ నమ్మవద్దు. బదులుగా అన్నింటినీ గమనించి మీ అనుభవం నుంచి జ్ఞానాన్ని పొందండి. ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఏది చెడ్డదో, ఏది మంచిదో పిల్లలకు చిన్నప్పుడే చెప్పడం మంచిది.
68
చదివే అలవాటు...
మీరు రోజుకి ఒక్క పేజీ చదివినా, ఆ విషయాన్ని పిల్లలకు చెప్పండి. పిల్లల కోసం చిన్న చిన్న పుస్తకాలు ఇంటికి తీసుకురండి, వాటిని పిల్లలకు చదవడానికి ఇవ్వండి. దీనివల్ల పిల్లలకు చిన్నప్పటి నుంచే పుస్తకాలపై ఇష్టం ఏర్పడుతుంది.
78
శుభ్రంగా ఉంచుకోవడం...
శుభ్రత దైవభక్తి కన్నా గొప్పది. మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. పిల్లలకు చిన్నప్పుడే శుభ్రత గురించి నేర్పించాలి. దానికోసం మీరు సమయం కేటాయించాలి. అప్పుడే పిల్లలు శుభ్రత గురించి తెలుసుకుంటారు.
88
ఎక్కువ నిద్ర కూడా ప్రమాదమే..
నిద్రపోవడం చాలా ముఖ్యం, కానీ రోజుకు 9 గంటల కంటే ఎక్కువ నిద్రపోవద్దు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది పెద్దలకే కాదు, పిల్లలకు కూడా వర్తిస్తుంది. పిల్లలను కూడా ఎక్కువసేపు నిద్రపోనివ్వద్దు.